క్రిష్‌ని దూరం పెడుతున్న మెగా ఫ్యామిలీ?

క్రిష్‌ని దూరం పెడుతున్న మెగా ఫ్యామిలీ?

'గౌతమిపుత్ర శాతకర్ణి' ఆడియో వేడుకలో 'ఖబడ్దార్‌' అంటూ క్రిష్‌ చేసిన వ్యాఖ్య ఎంత దుమారం రేపిందో తెలిసిందే. ఆ చిత్రం ప్రమోషన్‌ వ్యవహారాల్లో కూడా క్రిష్‌ మెగా ఫ్యామిలీని నొప్పించినట్టు గుసగుసలు వినిపించాయి. తన వ్యాఖ్యలకి క్రిష్‌ ఎన్ని వివరణలు ఇచ్చుకున్నప్పటికీ మెగా క్యాంప్‌ అతని పట్ల కినుక వహించినట్టుగా గాసిప్స్‌ షికారు చేస్తున్నాయి.

క్రిష్‌తో మంచి స్నేహ సంబంధాలున్న చరణ్‌ కూడా ఈమధ్య అతడిని అంత పట్టించుకోవడం లేదట. చిరంజీవి మలి చిత్రానికి క్రిష్‌ పేరు పరిశీలనలోకి వచ్చిన సంగతి విదితమే. అయితే ఆ ఆడియో వేడుక తర్వాత క్రిష్‌ని అసలు పరిగణనలోకి తీసుకోలేదట. చిరంజీవి మలి చిత్రం ఎవరు డైరెక్ట్‌ చేస్తారనే దానిపై డిబేట్‌ కూడా లేకుండా సురేందర్‌ చేస్తాడంటూ చరణ్‌, చిరు గట్టిగా చెప్పారట.

ధృవ చిత్రానికి సురేందర్‌ చూపిన డెడికేషన్‌, క్రాఫ్ట్‌పై తనకున్న పట్టుతో చిరంజీవి, చరణ్‌ ఫిదా అయిపోయారని, అందుకే 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' అయినా మరింకే ప్రాజెక్ట్‌ అయినా 151వ చిత్రాన్ని డైరెక్ట్‌ చేసేది సూరి మాత్రమేనని మిగిలిన వారి పేర్లన్నీ పక్కన పడేసారట. సినీ రంగంలో శాశ్వత శత్రుత్వం వుండదని అంటుంటారు కనుక ఈ గాసిప్స్‌ అన్నీ నిజమే అయితే మళ్లీ మెగాకి క్రిష్‌ దగ్గరవుతాడేమో కూడా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English