‘మేడ మీద అబ్బాయి’ ఏమంటున్నాడు

‘మేడ మీద అబ్బాయి’ ఏమంటున్నాడు

అల్లరి నరేష్ కెరీర్ ఎందుకు తల్లకిందులయ్యిందో అందరికీ తెలుసు. అతడి పేరడీ వేషాలకు కాలం చెల్లిపోయింది. ‘జబర్దస్త్’ లాంటి హై డోస్ కామెడీలు చూసి ఎంజాయ్ చేస్తున్న జనాలకు అల్లరోడి రొటీన్ కామెడీ ఎక్కట్లేదు. దీంతో అతడి సినిమాలు వరుసగా బోల్తా కొట్టేస్తున్నాయి. మళ్లీ మళ్లే ఒకే తరహా సినిమాలు చేసి దారుణంగా దెబ్బ తిన్నాడు నరేష్. గత కొన్నేళ్లలో ప్రేక్షకుల అభిరుచి ఎంతో మారింది. వాళ్లు కొత్తదనానికి పెద్ద పీట వేస్తున్నారు. వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నారు. హీరోలందరూ కూడా రూటు మార్చి కొత్త దారిలో వెళ్తున్నారు. అల్లరోడు కూడా తప్పక ఆ దారిలోనే ప్రయాణించక తప్పని పరిస్థితి తలెత్తింది.

ఈ నేపథ్యంలో తన కొత్త సినిమా ‘మేడ మీద అబ్బాయి’ ప్రేక్షకుల్ని కచ్చితంగా సంతృప్తి పరుస్తుందంటున్నాడు అల్లరి నరేష్. ప్రతి ఒక్కరూ తమ సినిమా గురించి కొత్తగా ఉంటుందని అంటారని.. ఐతే ‘మేడ మీద అబ్బాయి’ విషయంలో తాను ఆ మాట చెప్పబోనని.. సినిమా చూసి ప్రేక్షకులే ఈ మాట అంటారని.. ఆ విషయం వాళ్లకే వదిలేస్తున్నానని అల్లరి నరేష్ అన్నాడు. మలయాళంలో హిట్టయిన కామెడీ థ్రిల్లర్ ‘ఒరు వడక్కన్ సెల్ఫీ’కి రీమేక్‌గా తెరకెక్కుతన్న సినిమానే ‘మేడ మీద అబ్బాయి’. మొదట ఈ చిత్రాన్ని ‘అలా ఎలా’ ఫేమ్ అనీష్ కృష్ణ డైరెక్షన్లో రీమేక్ చేద్దామనుకున్నారు. కానీ తర్వాత ఆలోచన మారింది. మలయాళ వెర్షన్‌కు దర్శకుడైతే ప్రజీషే తెలుగులోనూ డైరెక్ట్ చేయబోతున్నాడు. జాహ్నవి ఫిలిమ్స్ అనే కొత్త బేనర్లో ఈ చిత్రం తెరకెక్కనుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు