క్రిష్ ఎక్స్‌ప్రెస్ చిరు దగ్గర ఆగిందా?

క్రిష్ ఎక్స్‌ప్రెస్ చిరు దగ్గర ఆగిందా?

ఎవ్వరూ ఊహించని విధంగా నందమూరి బాలకృష్ణ వందో సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాన్ని దక్కించుకున్న క్రిష్.. దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. బాలయ్య లాంటి మాస్ హీరోను క్రిష్ ఎలా ప్రెజెంట్ చేస్తాడో అన్న సందేహాలకు తెరదించుతూ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి చారిత్రక చిత్రంలోనూ చక్కటి హీరోయిజం పండించాడు.

దీంతో ఇంతకుముందు క్రిష్ తో పని చేయడానికి సందేహించిన పెద్ద హీరోలు.. ఇప్పుడు అతడితో సినిమాకు బాగానే ఆసక్తి చూపిస్తున్నారు. ‘శాతకర్ణి’ తర్వాత విక్టరీ వెంకటేష్ క్రిష్‌తో సినిమా చేయడానికి ముందుకొచ్చాడు. ఐతే వెంకీ కోసం అనుకున్న కథ.. ఒక నవల నుంచి తీసుకున్నది. కానీ ఆ నవల హక్కులు దక్కించుకోలేకపోవడంతో ఈ సినిమా ముందుకు కదల్లేదు. ఐతే ఇప్పుడు స్వయంగా మెగాస్టార్ చిరంజీవితోనే సినిమా చేసే ప్రయత్నాల్లో క్రిష్ ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఇటీవలే క్రిష్ మెగాస్టార్ ఇంటికి వెళ్లి ఓ కథ చెప్పినట్లు సమాచారం. చిరు తనయుడు చరణ్‌తో క్రిష్‌కు మంచి సంబంధాలున్నాయి. క్రిష్‌తో పని చేయడానికి చరణ్ కూడా ఆసక్తి చూపించాడు. దీంతో క్రిష్ చెప్పిన కథ చరణ్ కోసమే అన్న ప్రచారం మొదలైంది. ఐతే క్రిష్ మాత్రం చిరంజీవితోనే సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఐతే క్రిష్ కథకు చిరు ఓకే చెప్పాడా లేదా అన్నది తెలియదు. చిరు ఓకే అనాలే కానీ.. ఎలాంటి సినిమా అయినా ఆరు నెలల్లో పూర్తి చేసి విడుదలకు సిద్ధ చేసేస్తాడు క్రిష్. ‘శాతకర్ణి’ విషయంలో క్రిష్ స్పీడేంటో అందరూ చూశారు కదా. కాకపోతే చిరు ముందుగా ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ని పూర్తి చేయాల్సి ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు