ఇక్కడ బ్లాక్ బస్టర్.. అక్కడ డిజాస్టర్

ఇక్కడ బ్లాక్ బస్టర్.. అక్కడ డిజాస్టర్

రెండేళ్ల కిందట తెలుగులో పెద్దగా అంచనాల్లేకుండా విడుదలైంది 'పటాస్' సినిమా. ఐతే తొలి షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం అనూహ్యమైన విజయం సాధించింది. రూ.10 కోట్ల లోపు బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం పాతిక కోట్ల దాకా షేర్ రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఈ సినిమా సాధించిన విజయం చూసి పొరుగు భాషల నుంచి రీమేక్ హక్కుల కోసం నిర్మాతలు ఎగబడ్డారు.

కన్నడలో గోల్డెన్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న గణేష్ హీరోగా 'పటాస్'ను రీమేక్ చేశారు. అక్కడ మంచి ఫలితమే వచ్చింది. తమిళంలో ఈ చిత్రాన్ని 'మొట్ట శివ కెట్ట శివ' పేరుతో లారెన్స్ హీరోగా ఆర్.బి.చౌదరి నిర్మించాడు. సాయిరమణి దర్శకత్వం వహించాడు.

గత ఏడాదే పూర్తయినా అనివార్య కారణాల వల్ల వాయిదా పడి ఎట్టకేలకు మార్చి 9న విడుదలైంది. ఐతే ఈ సినిమా అంచనాల్ని అందుకోవడంలో దారుణంగా విఫలమైంది. ఫ్లాప్ టాక్‌తో మొదలైన ఈ చిత్రం అట్టర్ ఫ్లాప్ దిశగా సాగుతోంది.  తమిళంలో లారెన్స్ మరీ ఓవరాక్షన్ చేశాడని విమర్శకులు అంటున్నారు. లారెన్స్‌కు ఉన్న మాస్ ఇమేజ్ వల్ల బి, సి సెంటర్లలో ఓపెనింగ్స్ పర్వాలేదు కానీ.. టాక్ అయితే బ్యాడ్‌గా ఉంది. రివ్యూలు నెగెటివ్‌గా వచ్చాయి. వీకెండ్ తర్వాత సినిమా నిలబడే పరిస్థితి కనిపించడం లేదు. లారెన్స్ గత సినిమాలు మంచి విజయం సాధించిన నేపథ్యంలో ఈ చిత్రాన్ని మంచి రేట్లకే అమ్మారు.

ఐతే దీనికి పోటీగా విడుదలైన 'మానగరం' సినిమా అక్కడ సూపర్ హిట్ టాక్‌ తెచ్చుకుంది. నెగెటివ్ రివ్యూలకు తోడు.. పోటీలో ఉన్న సినిమాకు పాజిటివ్ టాక్, రివ్యూస్ రావడంతో 'మొట్ట శివ కెట్ట శివ'పై బాగా ప్రభావం చూపేలా ఉంది. ఫైనల్‌గా ఈ చిత్రం డిజాస్టర్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English