పవన్‌కళ్యాణ్‌లో మనం చూడని యాంగిల్‌

పవన్‌కళ్యాణ్‌లో మనం చూడని యాంగిల్‌

పవన్‌కళ్యాణ్‌ని త్రివిక్రమ్‌ రెండు సార్లు డైరెక్ట్‌ చేసాడు. జల్సాలో స్టూడెంట్‌గా, నక్సలైట్‌గా చూపించిన త్రివిక్రమ్‌ 'అత్తారింటికి దారేది'లో ఈగో ఎక్కువ వుండే అపర ధనవంతుడిగా, అత్తయ్య కోసం డ్రైవర్‌గా మారే యువకుడిగా చూపించాడు. మరి ముచ్చటగా మూడోసారి పవన్‌ని డైరెక్ట్‌ చేయబోతున్న త్రివిక్రమ్‌ ఈసారి అతడినెలా చూపించనున్నాడు? త్రివిక్రమ్‌ చిత్రంలో పవన్‌ ఇంతవరకు కనిపించని విధంగా కనిపిస్తాడట.

పవన్‌ కోసం ఒక చిత్రమైన క్యారెక్టరైజేషన్‌ని త్రివిక్రమ్‌ తీర్చి దిద్దాడని, క్యారెక్టర్‌ బేస్డ్‌గా ఈ సినిమా నడుస్తుందని ఇన్‌సైడ్‌ టాక్‌. పవన్‌ని అభిమానులు ఎలా చూడాలనుకుంటారో అవన్నీ వుంటూనే ప్రేక్షకులకి ఈ చిత్రం సరికొత్త అనుభూతినిస్తుందట. ఈ క్యారెక్టర్‌ని పిల్లల నుంచి పెద్దల వరకు ఇమిటేట్‌ చేసేలా చాలా ఎఫెక్టివ్‌గా వుంటుందని, ఇందులో కొన్ని కొత్త మేనరిజమ్స్‌ని కూడా చూపించబోతున్నారని టాక్‌.

ఒక్క మాటలో చెప్పాలంటే రజనీకాంత్‌ మాదిరిగా పవన్‌ ఇందులో తన స్టయిల్స్‌తోనే పిచ్చెక్కిస్తాడట. స్క్రిప్ట్‌ పక్కాగా సిద్ధమైందని, ఒక్కసారి సెట్స్‌ మీదకి వెళితే నాలుగే నెలల్లో పూర్తయిపోతుందని అంటున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్‌ చేసేలా ప్లానింగ్‌ జరుగుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు