ఆంటీ ఫోటోలతో రచ్చ చేస్తున్నారు

ఆంటీ ఫోటోలతో రచ్చ చేస్తున్నారు

తమిళ రాజకీయ నాయకుడు కరుణానిది రాసిన ఒక స్టోరీతో ఒక సినిమా వచ్చింది. ఇందులో జీన్స్‌ సినిమాతో తెలుగువారికి పరిచయమైన ప్రశాంత్‌ హీరో. పూజ, దివ్య అనే ఇద్దరమ్మాయిలు హీరోయిన్లు. కాని ఇవన్నీ తెలుగులో పబ్లిసిటీ పనికిరావు. 2011లో తమిళంలో పొన్నార్‌ శంకర్‌ పేరుతో వచ్చిన ఒక ఫ్లాపు సినిమాను ఇప్పుడు 'రాజకోట రహస్యం' పేరుతో తెలుగులోనికి అనువదిస్తున్నారు. అయితే ఈ సినిమా పబ్లిసిటీ కోసం సినిమాలో హీరో చెల్లెలిగా చేసిన మాజీ హీరోయిన్‌ స్నేహ ఫోటోలను తెగ వాడేస్తున్నారు.

సరిగ్గా తన పెళ్ళికి ముందు ఈ సినిమాను చేసిన స్నేహ, ఒక పాటలో తన ముదురు నాభి అందాలతో యువతను కాస్త ఎట్రాక్ట్‌ చెయ్యడానికి ప్రయత్నించింది. ఇప్పుడు ఆ స్టిల్స్‌ను పట్టుకొని మనోళ్లు క్యాష్‌ చేసుకుందామని చాలా ట్రై చేస్తున్నారుకాని, ఈ ఆంటీ ఫోటోలు చూపిస్తే దియేటర్లకు వచ్చేస్తామా అంటున్నారు ప్రేక్షకులు. వచ్చే శుక్రవారంనాడు ఒక్క సినిమా కూడా లేకపోవడంతో తెలుగు జనాల ముందుకు ఈ రహస్యం వస్తోంది. ఒక్క స్నేహ నాభిఅందాలు తప్ప ఇందులో ఏమున్నాయో చూడాలంటే, అప్పటివరకు ఆగండి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు