అరవ సినిమాలే ఆకర్షిస్తున్నాయి

అరవ సినిమాలే ఆకర్షిస్తున్నాయి

అన్ సీజన్లో చిన్న సినిమాలు వరుస కట్టేస్తున్నాయి. పోయిన వారాంతంలో ఒకే రోజు మూడు సినిమాలు రిలీజైతే.. ఈ వీకెండ్లో ఏకంగా ఆరేడు సినిమాలు థియేటర్లలోకి దిగిపోతున్నాయి. ఇందులో తెలుగు సినిమాలూ ఉన్నాయి. తమిళ డబ్బింగ్ చిత్రాలూ ఉన్నాయి. ఐతే తెలుగు సినిమాలతో పోలిస్తే డబ్బింగ్ సినిమాలకే కొంచెం క్రేజ్ కనిపిస్తోంది. ఈ సినిమాలకు ఆల్రెడీ పాజిటివ్ రివ్యూలు రావడమే ఇందుకు కారణం.

ఈ వారం వస్తున్న తెలుగు సినిమాల్లో ముందు చెప్పుకోవాల్సింది మంచు లక్ష్మి ‘లక్ష్మీబాంబు’ గురించే. ఐతే ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడటంతో ముందున్న బజ్ తగ్గిపోయింది. ఇక అంజలి సినిమా ‘చిత్రాంగద’ అయితే ఎప్పుడో ఏడాది కిందట రావాల్సిన సినిమా. పూర్తిగా క్రేజ్ పోయాక ఇప్పుడు మొక్కుబడిగా రిలీజ్ చేస్తున్నారు. ఇక ‘ఆకతాయి’ సినిమా కూడా ప్రేక్షకుల్ని అంతగా ఆకర్షించట్లేదు.

ఇక తమిళ డబ్బింగ్ సినిమాల సంగతి చూస్తే.. సందీప్ కిషన్-రెజీనా జంటగా నటించిన ‘నగరం’ ఆల్రెడీ పాజిటివ్ రివ్యూలు తెచ్చుకుంది. అటు తమిళంలో.. ఇటు తెలుగులో ముందే ప్రివ్యూలు వేయడం.. క్రిటిక్స్ అందరికీ ఈ సినిమా నచ్చడం.. పాజిటివ్ రివ్యూలు ఇవ్వడం సినిమాకు కలిసొచ్చే అంశమే. ఇక రెహమాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘16’ తమిళంలో సెన్సేషనల్ హిట్టయింది. ఈ చిత్రానికి అద్భుతమైన రివ్యూలు వచ్చాయి. దీని ట్రైలర్ కూడా ఆసక్తి రేకెత్తించింది. ఈ నేపథ్యంలో తెలుగు సినిమాలతో పోలిస్తే తమిళ డబ్బింగ్ చిత్రాలకే ఈ వారం కొంచెం క్రేజ్ కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు