ఈ ఏడాదే మూడు సినిమాలు

ఈ ఏడాదే మూడు సినిమాలు

గ‌త కొన్నేళ్ల‌లో సినీ నిర్మాణం తీరు మారింది. రెండు మూడు నిర్మాణ సంస్థ‌లు క‌లిసి సినిమాలు నిర్మించే సంస్కృతి టాలీవుడ్లో ఊపందుకుంది. టాలీవుడ్లో బ‌డా నిర్మాణ సంస్థ‌లన్నీ ఈ బాట‌లోనే న‌డుస్తున్నాయి. అందులో గీతా ఆర్ట్స్ ఒక‌టి. ఆ సంస్థ యువి క్రియేష‌న్స్‌తో క‌లిసి ‘భ‌లే భ‌లే మ‌గాడివోయ్’.. దిల్ రాజుతో క‌లిసి ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమాల్ని నిర్మించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు గీతా ఆర్ట్స్‌.. యువి క్రియేష‌న్స్‌తో పాటు ప్ర‌ముఖ కోలీవుడ్ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్‌ క‌లిసి ప్ర‌త్యేకంగా ఒక ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌ను ఏర్పాటు చేయ‌డం విశేషం. ఈ సంస్థ పేరు.. వి4 క్రియేష‌న్స్.

ఈ వి4 క్రియేష‌న్స్ బేన‌ర్ మీద ఈ ఏడాదే మూడు సినిమాలు నిర్మించ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్న‌ట్లు సమాచారం. త్వ‌ర‌లోనే వి4 బేన‌ర్లో తొలి సినిమాను అనౌన్స్ చేయ‌నున్నారు. అవ‌న్నీ మీడియం రేంజి సినిమాలే.ఫ్రెష్ స్టోరీ ఐడియాల‌తో వచ్చే కొత్త ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశం క‌ల్పిస్తూ మీడియం బ‌డ్జెట్లో సినిమాలు తీయ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ మూడు సంస్థ‌లూ ఒక్క‌తాటిపైకి వ‌చ్చాయ‌ట‌. ఏటా రెండు మూడు సినిమాలు తీయాల‌ని టార్గెట్ పెట్టుకున్నారు. ఈ బేన‌ర్లో వ‌చ్చే సినిమాల్ని అల్లు అర‌వింద్ స‌మ‌ర్పిస్తారు. గీతా ఆర్ట్స్ త‌రపున బ‌న్నీ వాసు ఈ చిత్రాల్ని ప‌ర్య‌వేక్షిస్తాడు. ఇక‌పై గీతా ఆర్ట్స్-2 బేన‌ర్‌ మీద సోలోగా సినిమాలు తీసే అవ‌కాశాలు లేన‌ట్లే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు