అతని చేతిలో రాజశేఖర్‌ కూతురు

అతని చేతిలో రాజశేఖర్‌ కూతురు

రాజశేఖర్‌, జీవిత దంపతులు చాలా కాలంగా తమ పెద్దమ్మాయి శివానిని హీరోయిన్‌గా పరిచయం చేయాలని చూస్తున్నారు. వాళ్లే స్వయంగా ఒక సినిమా కూడా నిర్మించారు కానీ అది మధ్యలోనే ఆగిపోయింది. ఆర్ట్‌ సినిమాలతో కాకుండా కమర్షియల్‌ చిత్రంతో పరిచయం చేస్తేనే ఉత్తమమని వాళ్లు భావించారు.

ఇందుకోసం ఇండస్ట్రీలో పలువురితో సంప్రదింపులు జరిపినప్పటికీ శివానీ ఇంట్రడక్షన్‌ ఆలస్యమవుతూ వచ్చింది. అయితే చాలా మంది కొత్త వాళ్లని పరిశ్రమకి పరిచయం చేసి, స్టార్లని చేసిన డైరెక్టర్‌ తేజ ఆ బాధ్యతలు తీసుకోవడానికి ముందుకొచ్చినట్టు సమాచారం. రాజశేఖర్‌ ఫ్యామిలీకి క్లోజ్‌ అయిన ఇండస్ట్రీ వాళ్లలో తేజ ఒకడు. రాజశేఖర్‌తో ఒక సినిమా తలపెట్టినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు.

ఇప్పుడు ఆయన కుమార్తెని హీరోయిన్‌ని చేస్తానని తేజ మాటిచ్చాడట. ప్రస్తుతం రాణాతో ఒక పొలిటికల్‌ థ్రిల్లర్‌ చేస్తున్న తేజ అది పూర్తయిన వెంటనే కొత్తవాళ్లతో ఒక ప్రేమకథా చిత్రం చేస్తాడట. అందులో హీరోయిన్‌గా శివానిని ఫిక్స్‌ చేసేసాడట. హీరోల కూతుళ్లు ఇండస్ట్రీలో సక్సెస్‌ అయిన దాఖలాలు లేని నేపథ్యంలో రాజశేఖర్‌ కుమార్తెకి ఎలాంటి స్వాగతం లభిస్తుందనేది ఆసక్తికరమే. తేజలాంటి సమర్ధుడి చేతిలో వుంది కనుక కాజల్‌ అంత పెద్ద హీరోయిన్‌ అవుతుందని రాజశేఖర్‌ దంపతులు ఆశిస్తారేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English