సెక్స్‌ సీన్ల బాగోతంలో అడ్డంగా బుక్కయ్యారు

సెక్స్‌ సీన్ల బాగోతంలో అడ్డంగా బుక్కయ్యారు

స్వర భాస్కర్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తోన్న 'అనార్కలి ఆఫ్‌ ఆరా' చిత్రం లీక్‌ అయిన సీన్లతో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. సెన్సార్‌ బోర్డు కట్‌ చేసిన దృశ్యాలు ఇంటర్నెట్‌లో ఎలా వచ్చాయంటూ నిర్మాతలు వాపోయారు. సినిమాపై బ్యాడ్‌ ఇమేజ్‌ తీసుకురావడానికి అలాంటి సీన్లు కట్‌ చేసి పెట్టారంటూ లీక్‌ అయిన సెక్స్‌ సీన్ల పట్ల స్వర భాస్కర్‌ తెగ బాధ పడిపోయింది.

ఇందులో సెన్సార్‌ సభ్యుల హస్తం వుందన్నట్టుగా మాట్లాడిన చిత్ర బృందం ఏ రేంజ్‌లో నాటకాలు ఆడారనేది ఇప్పుడే వెలుగులోకి వచ్చింది. ఆ చిత్రానికి ఇంకా అసలు సర్టిఫికేషనే జరగలేదని, ఇక ఏ దృశ్యాలు వుంచాలో, కట్‌ చేయాలో ఎలా చెప్తామని సెన్సార్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ పహ్లాజ్‌ నిహలానీ అన్నారు. తమ సినిమాలని ప్రమోట్‌ చేసుకోవడానికి సెన్సార్‌ బోర్డుని వాడుకోవడం మామూలైపోయిందని, ప్రతి దానికీ తమనే నిందిస్తూ ఇలాంటి చీప్‌ మార్కెటింగ్‌ ట్రిక్కులు చేస్తున్నారని ఆయన తీవ్ర స్వరంలో మండిపడ్డారు.

ఈ న్యూస్‌ బయటకి వచ్చినపుడే ఇందులో సదరు సినిమా వాళ్ల హస్తమే వుండి వుంటుందని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ చిత్రంపై ఎలాంటి బజ్‌ లేకపోవడంతో వార్తల్లో వుంచడానికి చేసారని అనుకున్నారు. చూస్తుంటే ఇది అచ్చంగా అలాంటి పబ్లిసిటీ గిమ్మిక్కేనని అనిపిస్తోంది. అప్పుడు మొసలి కన్నీరు కార్చిన చిత్ర బృందం ఇప్పుడు మీడియాని ఏ ముఖం పెట్టుకుని ఫేస్‌ చేస్తారో మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు