నిన్న ఎఫైర్.. నేడు బ్రేకప్?

 నిన్న ఎఫైర్.. నేడు బ్రేకప్?

తనకంటే వయసులో చాలా పెద్ద అయిన అధునాను పెళ్లి చేసుకుని చాలా ఏళ్లపాటు అన్యోన్యంగా గడిపాడు డైరెక్టర్ కమ్ సింగర్ కమ్ యాక్టర్ ఫర్హాన్ అక్తర్. ఐతే బాలీవుడ్లో మోస్ట్ సెలబ్రెటెడ్ కపుల్స్‌లో ఒకటిగా ఉన్న జంట రెండేళ్ల కిందట విడిపోవడం ముంబయి జనాలకు పెద్ద షాకే. అధునాతో విడాకుల తర్వాత ఫర్హాన్.. అదితి రావు హైదరితో ఎఫైర్ మొదలుపెట్టినట్లుగా వార్తలొచ్చాయి. కానీ ఆ వార్తలు ఎంతో కాలం నిలవలేదు. ఈ మధ్యే శ్రద్ధా కపూర్‌తో ఫర్హాన్ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయినట్లుగా వార్తలొచ్చాయి.

‘రాక్ ఆన్-2’ కోసం కలిసి పని చేస్తుండగా ఫర్హాన్-శ్రద్ధ చాలా క్లోజ్‌గా మూవ్ అయినట్లు చెప్పుకున్నారు. ఆ మధ్య ఒక ఇంటర్వ్యలో మాట్లాడుతూ.. తనకు ఫర్హాన్‌తో లాంగ్ డ్రైవ్ వెళ్లడమంటే చాలా ఇష్టమని.. ఇంకా అతడి గురించి ఏవేవో కబుర్లు చెప్పింది శ్రద్ధ. ఫర్హాన్ సైతం శ్రద్ధ గురించి పాజిటివ్‌గా మాట్లాడాడు. ఐతే ఇంతలో ఏమైంద ఏమో.. వీళ్లిద్దరికీ బ్రేకప్ జరిగినట్లు బాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

చూస్తుంటే ఫర్హాన్ విడాకుల తర్వాత ఏడాదికో గర్ల్ ఫ్రెండ్‌ను మార్చేస్తున్నట్లుగా ఉంది. శ్రద్ధాకు ఇది తొలి ఎఫైరేమీ కాదు. తన తొలి సినిమా హీరో సిద్ధార్థ్ రాయ్ కపూర్‌తోనూ ఆమె కొన్నాళ్లు డీప్ లవ్‌లో ఉన్నట్లు వార్తలొచ్చాయి. మరి ఈ బ్రేకప్ తర్వాత ఫర్హాన్.. శ్రద్ధ తమకు తోడుగా ఎవరిని చూసుకుంటారో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు