ఆ హీరో క్రేజ్ పెరుగుతుంది

ఆ హీరో క్రేజ్ పెరుగుతుంది

రాజ్ తరుణ్ ఆ రేంజికి చేరిపోయాడా..

రాజ్ తరుణ్ హీరోగా చేసింది ఆరు సినిమాలు. అందులో ఐదు హిట్టవడం విశేషం. ఇంత మంచి ట్రాక్ రికార్డున్న హీరోలు టాలీవుడ్లో చాలా తక్కువమంది. ఒక్క ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ తప్పితే రాజ్ తరుణ్ హీరోగా చేసిన ప్రతి సినిమా నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది. తాజాగా ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’తో మరో హిట్టు ఖాతాలో వేసుకున్నాడీ యువ కథానాయకుడు. యావరేజ్ టాక్ తో మొదలైన ఈ చిత్రం.. ఇప్పటికే దాదాపుగా పెట్టుబడిని వెనక్కి తెచ్చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగులో రాజ్ తరుణ్ క్రేజ్ మరింత పెరిగింది. ఆల్రెడీ అతడితో తెలుగులో క్యామియో రోల్స్ చేయిస్తున్న సంగతి తెలిసిందే.

విశేషం ఏంటంటే.. రాజ్ ఇప్పుడు తమిళ సినిమాలో కూడా క్యామియో చేసే రేంజికి ఎదిగిపోయాడు. జై-అంజలి జంటగా నటిస్తున్న ‘బెలూన్’ సినిమాలో అతను ఒక అతిథి పాత్ర చేసినట్లు సమాచారం. తమిళ ప్రేక్షకులకు పరిచయమే లేని రాజ్ తో క్యామియో చేయించడం ఆశ్చర్యం కలిగించే విషయమే. బహుశా ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువాదం చేసినపుడు పనికొస్తుందని భావించారేమో. ‘జర్నీ’ సినిమాతో జై-అంజలి జంటకు మంచి క్రేజ్ వచ్చింది తెలుగులో. పైగా ఈ మధ్య వీళ్లిద్దరి ప్రేమాయణం కూడా హాట్ టాపిక్ అయింది. ఇక రాజ్ కూడా తోడయ్యాడంటే సినిమాకు తెలుగులో మంచి క్రేజ్ తీసుకురావచ్చని ఇలా ప్లాన్ చేసినట్లుంది. సినీష్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు