న్యూడ్‌ వీడియోలతో జర్రంత జాగ్రత్త

న్యూడ్‌ వీడియోలతో జర్రంత జాగ్రత్త

బాయ్‌ఫ్రెండ్‌ అడిగాడని న్యూడ్‌ ఫోటోలు, వీడియోలు తీసి షేర్‌ చేయడం ఈతరం అమ్మాయిల్లో కామన్‌ అయిపోయింది. ఒకరిని చూసి ఒకరు ఈ దరిద్రాన్ని ఫాలో అయిపోతున్నారు. కానీ అబ్బాయిలు వాళ్లు మాత్రం చూసేసి ఊరుకోరుగా, వాటిని ఎవడితోనో షేర్‌ చేసుకుంటే అలా అలా చేతులు మారి చివరకు ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమవుతాయి. సగటు అమ్మాయిల పరిస్థితే ఇలాగుంటే సెలబ్రిటీలు ఈ న్యూడ్‌ సెల్ఫీల విషయంలో ఎంత కేర్‌ఫుల్‌గా వుండాలి? మొన్నటికి మొన్న ఐక్లౌడ్‌ని ఎవరో హ్యాక్‌ చేస్తే హాలీవుడ్‌ టాప్‌ సెలబ్రిటీల నగ్న చరిత్ర బయట పడిపోయింది.

అయినప్పటికీ ఈ విషయంలో జాగ్రత్తలు పాటించడం లేదు మన తారలు. సుచీ లీక్స్‌ పేరిట బయటకి వచ్చిన వీడియోలు, ఫోటోలు సంచిత షెట్టి, అనుయ లాంటి యువతరం నటీమణులని బజార్న పడేసింది. ఎవరినో మెప్పించడానికి పంపిన ఫోటోలు, వీడియోలు ఇలా వెళ్లకూడని వాళ్ల చేతికి పోయాయి. ఇంకా తన వద్ద టాప్‌ సెలబ్రిటీల నగ్న వీడియోల చిట్టానే వుందని సుచిత్ర హెచ్చరించింది. అయితే సరాసరి పెద్ద వాళ్లతో పెట్టుకోకుండా ముందుగా చిన్న తరగతి హీరోయిన్లపై ప్రతాపం చూపించింది.

దీంతో పెద్దవాళ్లు అలర్ట్‌ అయిపోయి ఆమెకి అడ్డుకట్ట వేసారు. అయితే చేతులంటూ మారాయి కాబట్టి ఎప్పుడో అప్పుడు ఆ వీడియోలు ఇంటర్నెట్‌లో సాక్షాత్కరించడం ఖాయం. ఎంతోమంది యువతుల పరువు తీసి పారేస్తున్నప్పటికీ సెలబ్రిటీలు సైతం ఇలాంటి వాటికి పూనుకోవడం ఎంతవరకు సమంజసం? ఒక్కసారి తమపై బ్యాడ్‌ అనే ముద్ర పడిపోతే ఇక కెరియర్‌ ఖతం అయిపోతుందని తెలిసీ రికార్డెడ్‌ ఎవిడెన్స్‌లు పెట్టుకోవడం వల్ల ఏమిటి ప్రయోజనం? ఈ ఉదంతంతో మేలుకొని అయినా ఇకపై ఇలాంటి వాటికి స్ట్రిక్ట్‌గా నో చెప్పడం చేయాలి. అలాగే న్యూడ్‌ సెల్ఫీలు తీసుకుని ఫోన్లో భద్రపరచుకునే విచిత్ర అలవాటుకీ దూరంగా వుండాలి. ఎందుకంటే ఏ హ్యాకర్‌ ఎప్పుడు ఫోన్ల మీద పడిపోతాడో తెలీదు కదా మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు