బిపాసా బసు అంత బలుపు చూపించిందా?

బిపాసా బసు అంత బలుపు చూపించిందా?

స్టార్ హీరోయిన్లు ప్రైవేటు కార్యక్రమాల్లో ఆడి పాడేందుకు ఒప్పుకుని డీల్స్ చేసుకోవడం.. పేమెంట్స్ దగ్గర తేడాలొచ్చి వివాదాలు తలెత్తడం మామూలే. ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ బిపాసా బసు ఇప్పుడు ఇలాంటి వివాదంలోనే చిక్కుకుంది. ఆమెకు బాగా తల పొగరంటూ ఒక సంస్థ ఆమెపై విరుచుకుపడింది.

ఆమె లండన్లో ఇండియా-పాకిస్థాన్ ఫ్యాషన్ షోలో పాల్గొనేందుకు అగ్రిమెంట్ కుదుర్చుకుందట. ఐతే చివ‌రి నిమిషంలో షోకు  గైర్హాజ‌రవడం ద్వారా నిర్వాహకుల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టిందట. ఈ షోలో పాల్గొనేందుకు తీసుకున్న డబ్బుల్ని హనీమూన్ కు వాడుకుని తమకు కుచ్చుటోపీ పెట్టిందటంటూ ఆ షో నిర్వాహకురాలు రోహిణి శ‌ర్మ.. బిపాసాపై ధ్వజమెత్తింది.

 ‘‘బిపాసా ఫ్యాషన్ షోలో పాల్గొనేందుకు అంగీకరిస్తూ అగ్రిమెంట్ చేసుకుంది. ఆమె కోసం లండ‌న్లోని ఓ స్టార్ హోట‌ల్లో గ‌దులు బుక్ చేశాం. వెంట భ‌ర్త‌ను తీసుకొస్తానంటే ఒప్పుకున్నాం. అడ్వాన్స్ ఇచ్చాం. ఆమె లండన్‌‌కు రాగానే రెండు సిమ్ కార్డులిచ్చాం. ఐతే వాటిలో ఐదేసి పౌండ్లు మాత్ర‌మే రీచార్జ్ అమౌంట్ ఉందంటూ వాటిని నేల‌కేసి కొట్టింది. షో కోసం ఇచ్చిన అడ్వాన్స్ మొత్తాన్ని హ‌నీమూన్‌కు ఖ‌ర్చు పెట్టేసుకుంది.  అయినా భ‌రించాం. అన్ని విషయాలూ మరిచిపోయి షోకు రావాలని గౌర‌వంగా పిలించాం. రాన‌ని మొండికేసింది. ఆమె వల్ల మాకు నష్టం వాటిల్లింది. దాన్నంతా ఆమె పూడ్చాల్సిందే. ఆమెను అంత తేలిగ్గా వదలం’’ అని పేర్కొంది రోహిణి శర్మ.

ఐతే తమ అవసరాల ప్రకారం షో నిర్వాహకులు నడుచుకోకపోవడం వల్లే తాను ఆ షోలో పాల్గొనలేకపోయానంటూ బిపాసా వివరణ ఇచ్చింది. కానీ ఆమె వివరణ ఇచ్చిన తీరు చూస్తేనే తప్పు తన వైపే ఉందని అర్థమవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English