పవన్‌ తగ్గమంటాడు, అతను పెరగమంటాడు

పవన్‌ తగ్గమంటాడు, అతను పెరగమంటాడు

పాపం యువ హీరోయిన్‌ కీర్తి సురేష్‌ ఇప్పుడు ఇబ్బందుల్లో పడింది. రెండు వదులుకోలేని ప్రాజెక్టులు ఆమె చేతికి వెళ్లాయి. దాంతో రెండిటినీ ఎలాగైనా దక్కించుకోవాలని చూస్తోంది. కాకపోతే ఈ రెండు సినిమాలకీ 'సైజ్‌' ప్రాబ్లమ్‌ వస్తోంది. 'సావిత్రి' జీవితంపై 'మహానటి' అనే చిత్రాన్ని నాగ్‌ అశ్విన్‌ తలపెట్టిన సంగతి తెలిసిందే.

సావిత్రి పాత్ర పోషించే అవకాశం ఎంతోమంది సీనియర్లని కాదని తనని వరించింది. ఈ పాత్రకి తగ్గట్టు కీర్తి సురేష్‌ లావుగా వుండాలి. సావిత్రి రూపానికి తగినట్టు కనిపించాలంటే కాస్త బరువు వుండడం తప్పనిసరి. అయితే అదే సమయంలో పవన్‌ కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ సినిమా కోసం కీర్తికి బరువు తగ్గాలని చెప్పారు. అంత పెద్ద స్టార్‌తో నటించే అవకాశం వదులుకోలేదు కనుక వెయిట్‌ రిడక్షన్‌పై ఆమె దృష్టి పెట్టింది.

ఈ రెండు సినిమాలు ఒకేసారి సెట్స్‌ మీదకి వెళ్లేలాగుండడంతో ప్రస్తుతం కీర్తి సంకట స్థితిలో వుంది. త్రివిక్రమ్‌ కోరినట్టుగా బరువు తగ్గాలా, లేక సావిత్రి పాత్ర కోసం పెరగాలా అంటూ ఆమె సందిగ్ధంలో పడిపోయింది. మరి ఈ ఇబ్బందికర పరిస్థితికి పరిష్కారాన్ని ఎలా కనుక్కుంటుందో, రెండు సినిమాలూ చేజారిపోకుండా ఎలా కాపాడుకుంటుందో? ఎవరన్నారండీ... హీరోయిన్లయితే ఇక లైఫ్‌ అంతా సుఖమేనని?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు