రోజాతో బీకాం ఫిజిక్స్ సీక్రెట్ చెప్పిన జ‌లీల్ ఖాన్‌

రోజాతో బీకాం ఫిజిక్స్ సీక్రెట్ చెప్పిన జ‌లీల్ ఖాన్‌

రాజ‌కీయాల్లో ఎంత డైన‌మిక్‌గా ఉంటుందో సంభాష‌ణ‌ల్లో అంత‌కంటే ఎక్క‌వ చ‌లాకిగా ఉండే సినీ న‌టీ, వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అంద‌రికీ స‌స్పెన్స్‌లో ఉన్న విష‌యాన్ని తెలిసేలా చేశారు. వైసీపీలో ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్ బీకాంలో ఫిజిక్స్ చ‌దివాను అనే డైలాగ్‌తో పాపుల‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. అయితే తాను ఎందుకు ఈ మాట అన్నాన‌నే విష‌యాన్ని రోజాతో జ‌లీల్ ఖాన్‌ పంచుకున్నాడు. న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ లో జ‌రుగుతున్న అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా ఈ విష‌యం వెల్ల‌డించారు.

స‌మావేశాల సంద‌ర్భంగా అసెంబ్లీ లాబీలో ఉన్న జ‌లీల్ ఖాన్‌ను అటుగా వ‌చ్చిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా హలో.. ఫిజిక్స్ అంటూ విష్ చేసింది! రోజా వస్తూవ‌స్తూనే లాబీలో ఉన్న జలీల్‌ఖాన్‌ను చూస్తూ నవ్వుతూ ఫిజిక్స్ అంటూ తట్టి పలుకరించడంతో అందరూ విస్తుపోయారు. ఇంత‌లోకి వైసీపీ ఎమ్మెల్యే సునీల్ కూడా తోడ‌య్యారు. 'బీకాంలో ఫిజిక్స్ అన్నా' అంటూ జలీల్ ఖాన్ తో చేయి కలిపారు. వెంటనే ఇక్కడ ఉన్నవారంతా పక్కున నవ్వేశారు. దీంతో జ‌లీల్ ఖాన్ రిప్లై  ఇస్తూ....'మీడియాలో హైలెట్ అవ్వాలంటే వాళ్లకు రివర్స్‌లో చెప్పాలి. నేను అలా చెప్ప‌డం వ‌ల్లే రావాల్సిన దాని కన్నా.. ఎక్కువ ప్రచారం తనకు వచ్చింది' అంటూ జలీల్‌ఖాన్ సంబరపడటం విశేషం.

ఇక అసెంబ్లీలో సైతం జ‌లీల్ ఖాన్‌పై పై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సెటైర్ వేశారు. త‌ను మాట్లాడే సమయంలో పదే పదే అడ్డు తగులుతున్న జలీల్‌ఖాన్‌పై జ‌గ‌న్ అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వృద్ధిరేటు, ద్రవ్యోల్బణం, రైతులకు మద్దతు ధర, పారిశ్రామిక, ఇతర రంగాలు వంటి అంశాలపై ప్రభుత్వం తీరును జ‌గ‌న్ త‌ప్పుప‌డుతుండ‌గా..జలీల్‌ఖాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన జగన్ జలీల్ ఖాన్ ను ఉద్దేశించి తాను చెబుతున్న లెక్కలు బీకాంలో ఫిజిక్స్ చదివిన వాళ్ళకు అర్థం కాకపోవచ్చని చురకలు వేశారు. మొత్తంగా బీకాంలో ఫిజిక్స్ చదివానంటూ ఇంటర్వ్యూలో చెప్పి అభాసుపాలైన ఎమ్మెల్యే జలీల్‌ను ‘సెటైర్లు’ వెంటాడుతూనే ఉన్నాయి. అటు సభలోనూ.. ఇటు లాబీల్లోనూ.. ప్రతిపక్షం వ్యంగ్య బాణాలు విసురుతూనే ఉంటే జ‌లీల్ ఖాన్ మాత్రం సంబ‌ర‌ప‌డిపోవ‌డం విశేషం!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English