రెండు దెబ్బల నుంచి కోలుకున్న నాగార్జున

రెండు దెబ్బల నుంచి కోలుకున్న నాగార్జున

హీరో నాగార్జునకు కొత్త సంవత్సరం పెద్దగా కలిసొచ్చినట్లు లేదు. రీసెంటుగా విడుదలైన ఆయన సినిమా  'నమో వేంకటేశాయ' దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు.  ప్రపంచవ్యాప్తంగా రూ. 36 కోట్లకు అమ్మగా... కనీసం రూ. 10 కోట్లను కూడా ఈ సినిమా వసూలు చేయలేక పోయింది. ఈ నష్టం చాలదన్నట్లుగా ఆయనకు వ్యక్తిగత జీవితంలోనూ భారీ దెబ్బ తగిలింది. కుమారుడు అఖిల్ వివాహం రద్దు కావడం కూడా ఆయనను చాలా డిస్టర్బ్ చేసింది. దీంతో, ఆయన గత రెండు వారాలుగా  ఏకాంతంగా గడిపారు. ఇప్పడు ఆ నిశ్శబ్దం నుంచి కోలుకుని నాగ్ బయటకు వచ్చారని చెబుతున్నారు. తన కొత్త సినిమా షూటింగులో పాల్గొంటున్నారట.

తన కొత్త సినిమా 'రాజుగారి గది-2' సినిమా షూటింగ్ కు నాగార్జున హాజరవుతున్నారు. అంతేకాదు, ఆ సినిమా షూటింగ్ స్పాట్ లో తీసిన ఓ ఫొటోను ట్విట్టర్లో అప్ లోడ్ చేశారు. 'బ్యాక్ టు బిజినెస్ విత్ రాజుగారి గది' అంటూ కామెంట్ పెట్టారు. దీంతో ఆయన అభిమానులంతా నాగార్జున మళ్లీ మామూలయ్యారని సంతోష పడుతున్నారట.

కాగా... అఖిల్, శ్రియల నిశ్చితార్థం తరువాత వివాహం రద్దయినా మళ్లీ ఆ ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు కొంతవరకు ఫలించే సూచనలు ఉండడంతో నాగార్జున మళ్లీ మామూలు మనిషయ్యారని తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు