అభిమాని గుండె ఆగింది

అభిమాని గుండె ఆగింది

ఒక విషాద ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. ఈ ఘటన గురించి తెలిసిన వారంతా అయ్యో అనకుండా ఉండలేని పరిస్థితి. తానెంతో అభిమానించే హీరోను కలుసుకున్నానన్న ఆనందమో.. మరేమో కానీ ఒక అభిమాని గుండె ఆగిపోయిన వైనం పలువురిని కదిలించింది వేసింది. బహుభాషా నటుడు.. ఈగ విలన్ సుదీప్ గుర్తున్నాడు కదా. ఆయన కన్నడలో పెద్ద హీరో. ఆయనకు ఓ రేంజ్లో ఫ్యాన్స్ ఉంటారు. తాజాగా.. ఆయన నటించిన కొత్త సినిమా ‘‘హెబ్బులి’’ విడుదలైంది. ఈ చిత్ర విజయోత్సవ వేడుకలు సోమవారం నుంచి షురూ అయ్యాయి.

ఈ ప్రచారంలో భాగంగా హీరో సుదీప్.. తమకూరు పట్టణంలోని గాయత్రి థియేటర్ కు వచ్చారు. ఈ సందర్భంగా సుదీప్ ను చూసేందుకు భారీ ఎత్తున అభిమానులు వచ్చారు. సుదీప్ ను అమితంగా అభిమానించే 45 ఏళ్ల శశిధర్.. తన అభిమాన హీరోను కలవటమే కాదు.. అప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు కూడా. తనను వరించిన అదృష్టానికిమురిసిపోయాడు. అభిమాన హీరోను ఆలింగనం చేసుకొని హ్యాపీగా ఫీలైన ఆయన ఇంటికి తిరిగి వెళ్లే క్రమంలో మార్గమధ్యంలో కుప్పకూలిపోయాడు.

ఆనందం మరీ ఎక్కువ అయ్యిందేమో కానీ.. అతడి గుండె ఆగిపోయింది.కుప్పకూలిపోయిన శశిధర్ ను ఆసుపత్రికి తరలించే లోపే మరణించిన వైనం పలువురిని కదిలించి వేసింది. ఈ ఘటన గురించి తెలిసిన వారంతా అప్రయత్నంగా అయ్యో అనకుండా ఉండలేకపోతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English