స్టార్‌ హీరోయిన్‌కి గడ్డి పెట్టిన డైరెక్టర్‌

స్టార్‌ హీరోయిన్‌కి గడ్డి పెట్టిన డైరెక్టర్‌

'కాఫీ విత్‌ కరణ్‌' షోకి వచ్చి కరణ్‌ జోహార్‌నే ఇబ్బంది పెట్టేలా పర్సనల్‌ కామెంట్స్‌ చేసిన కంగనా రనౌత్‌ గురించి అప్పుడు కరణ్‌ ఏమీ అనలేదు. అయితే ఒకానొక కార్యక్రమంలో మాట్లాడుతుండగా, అతడిపై కంగన చేసిన ఆరోపణల గురించిన ప్రస్తావన వచ్చినపుడు మాత్రం ఆమెకి మొహం వాచిపోయేలా గడ్డి పెట్టాడు.

కంగనా రనౌత్‌కి విక్టిమ్‌ కార్డ్‌ ప్లే చేయడం ఇష్టమని, తనకేదో ఇండస్ట్రీ అన్యాయం చేసేస్తుందనే భ్రమలో ఆమె వుంటుందని, తనపై ఆమె చేసిన ఏ వ్యాఖ్యలతోను తాను అంగీకరించనని, అయితే తనకంటూ ఒక అభిప్రాయం వుండవచ్చు కనుక, ఆ షోలో ఆమె చేసిన వ్యాఖ్యలను యథాతథంగా వుంచేసానని, అవసరమనుకుంటే వాటిని తొలగించే హక్కు, అధికారం తనకి వున్నాయని, కానీ ఆమె అభిప్రాయాన్ని గౌరవించి అలాగే ఉంచానని, అంత మాత్రం చేత ఆమె చేసిన వ్యాఖ్యలతో తాను అంగీకరిస్తున్నట్టు కాదని కరణ్‌ చెప్పాడు.

ఆమె చాలా గొప్ప నటి అని, తనకి వచ్చిన జాతీయ అవార్డులకి అర్హురాలని, కానీ తనకి బాలీవుడ్‌ అన్యాయం చేస్తోందనే మాటల్ని ఆమె కట్టి పెట్టాలని అన్నాడు. అంత ఇబ్బందిగా వుంటే ఇండస్ట్రీ వదిలి వెళ్లిపొమ్మని, తననెవరూ బలవంతంగా ఇక్కడ పని చేయమనడం లేదని కాస్త ఘాటుగానే స్పందించాడు. అయితే విమర్శలకి అంతే ఘాటుగా సమాధానం ఇచ్చే కంగన ఇప్పుడు కరణ్‌ చేసిన కామెంట్స్‌కి ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు