​అసలు ఎవరీ సుచిత్ర..?

​అసలు ఎవరీ సుచిత్ర..?

ఈ మధ్య తమిళనాడు వ్యతిరేక వార్తలు.. వివాదాలతోనే వార్తల్లో నిలుస్తోంది. జల్లికట్టు.. శశికళకు సంబంధించిన కాంట్రవర్శీలు హాట్ టాపిక్ అయ్యాయి. ఇప్పుడు సుచి లీక్స్ కూడా అదే స్థాయిలో సంచలనం రేపుతోంది. కోలీవుడ్ సెలబ్రెటీలకు సంబంధించిన ప్రైవేట్ ఫొటోలు.. వీడియోలను సుచిత్ర అనే సింగర్ బయటపెడుతుండటం సంచలనం రేపుతోంది. ఓవైపు తన అకౌంట్ హ్యాక్ అయిందని ఆమె అంటుంటే.. మరోవైపు కోలీవుడ్ సెలబ్రెటీలకు సంబంధించిన ప్రైవేటు ఫొటోలు ఆమె అకౌంట్ నుంచి బయటికి వస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ముందు అకౌంట్ హ్యాక్ అన్నారు.. ఇప్పుడు ఆమె మానసిక స్థితి బాలేదంటున్నారు. అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదు. ధనుష్ మనుషులు తనతో దురుసుగా ప్రవర్తించారంటూ ఫొటోలు పెట్టినపుడు జనాలు లైట్ తీసుకున్నారు. అప్పుడే ఆమె అకౌంట్ హ్యాక్ అయిందంటూ తన భర్త కార్తీక్ వివరణ ఇచ్చాడు. కానీ ఆ తర్వాత సుచి అకౌంట్ నుంచి ఫొటోలు వీడియోలు బయటికి వచ్చాయి. ఆ సందర్భంగా ఆమె సింగర్ చిన్మయితో ట్విట్టర్లో వాగ్వాదం జరిపిన తీరు చూస్తే.. ఆమె అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేసినట్లుగా ఏమీ అనిపించలేదు.

ఈ వివాదానికి ఎప్పుడు ఎలా తెరపడుతుందో కానీ.. ఇంతకీ ఈ సుచిత్ర ఎవరు అనే చర్చ ఇప్పడు పెద్ద ఎత్తున నడుస్తోంది. ఆమె బేసిగ్గా ఒక రేడియో జాకీ. పాటలు పాడే టాలెంట్ కూడా ఉంది. వాయిస్ కూడా టిపికల్‌గా ఉండటంతో సంగీత దర్శకులు అవకాశాలిచ్చారు. ఎక్స్‌క్యూజ్ మి మిస్టర్ మల్లన్న అంటూ ఆమె పాడిన పాట అప్పట్లో సూపర్ హిట్టయింది. ఆ తర్వాత దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలోనే ‘ఊసరవెల్లి’ సినిమాలో ఆడుదామా దాండియా అనే పాటను పాడిందామె. ఇటు తెలుగులో.. అటు తమిళంలో ఇంకొన్ని పాటలు కూడా పాడి మంచి పేరే సంపాదించింది సుచిత్ర. నటుడు కార్తీక్ కుమార్‌ను పెళ్లి చేసుకుని స్థిరపడింది. ఐతే ఈ మద్య వీళ్లిద్దరికీ విభేదాలు వచ్చినట్లు.. వ్యక్తిగత జీవితంలో సమస్యలతో సుచిత్ర మానసిక స్థితి దెబ్బ తిన్నట్లు వార్తలొస్తున్న సమయంలోనే ఈ ట్విట్టర్ సంచలనాలతో ఆమె పేరు మార్మోగిపోతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు