ప్రభాస్ సినిమాకు ఇంత హడావుడా

ప్రభాస్ సినిమాకు ఇంత హడావుడా

సినిమాల బడ్జెట్ భారీగా పెరిగిపోతోంది. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలు, పెద్ద దర్శకుల సినిమాల ఖర్చు ఆకాశాన్నంటుంతోంది. ఎంత ఖర్చు పెరుగుతున్నా కూడా పెద్ద సినిమాలను కూడా 30 నుంచి 35 కోట్లతో తీయగలుగుతున్నారు. ఇలాటి తరుణంలో సినిమాలోని ఒక సీన్ కోసమే 35 కోట్లు ఖర్చు చేయడం ఆసక్తి కలిగిస్తోంది. తెలుగు సినిమా రంగంలోనే ఇది రికార్డుగా నిలవనుంది. ప్రభాస్ సినిమాలోని ఓ సినిమా కోసం దర్శకుడు సుజిత్ 35 కోట్లు కేటాయించారట.

ప్రభాస్ తదుపరి సినిమా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. 150 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉండేలా హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ ‘కెన్నీ బేట్స్’ను తీసుకున్నారు. ఈ సినిమాలో 20 నిమిషాల పాటు కొనసాగే కారు ఛేజ్ సీన్ ఒకటి ఉందట. ఈ ఒక్క ఛేజ్ సీన్ కి దాదాపు 35 కోట్లను కేటాయించారనేది టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా, ప్రభాస్ కెరియర్లో మరో భారీ సినిమా అవుతుందని అంటున్నారు.

అసలు ఖర్చు ఎంత పెడుతున్నారో కానీ హడావుడి చేసి హైప్ సృష్టించి మాత్రం ప్రేక్షకులను మభ్య పెడుతున్నారన్న ఆరోపణలూ వస్తున్నాయి. తెలుగు దర్శకులంతా పోస్టర్ల నుంచి హాలీవుడ్ ను కాపీ కొడుతూ మాటలు మాత్రం పెద్దవి చెబుతున్నారని విమర్శకులు అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు