ఆ సింగర్ కు పిచ్చి ఉందట

ఆ సింగర్ కు పిచ్చి ఉందట

సినీ ప్రముఖులు.. హీరోలు, హీరోయిన్లు సన్నిహితంగా ఉండే చిత్రాలను పోస్టు చేస్తూ గాయని సుచిత్ర సంచలనం రేపుతున్నారు. తెలుగులో ఎన్నో పాటలు పాడిన తమిళ గాయని సుచిత్ర కార్తీక్ సోషల్ మీడియాలో వేడి పుట్టిస్తోంది. పలువురు హీరో హరోయిన్లు చాలా క్లోజ్ గా ఉన్న ఫొటోలను అప్ లోడ్ చేసి, ఇప్పటికే సుచిత్ర సంచలనం రేపింది.

తాజాగా రానా, త్రిషల ప్రైవేట్ ఫొటోను కూడా బయట పెట్టింది. రానా, త్రిషలు డీప్ లవ్ లో ఉన్నారని ఆ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వీరి ప్రేమాయణం గురించి మీడియా ఎన్నిసార్లు ప్రశ్నించినా... తాము మంచి స్నేహితులం మాత్రమే అంటూ వీరు తప్పించుకునేవారు. ఆ సమయంలో, త్రిష బుగ్గపై రానా గాఢంగా ముద్దు పెడుతున్న ఓ ప్రైవేట్ ఫొటోను ఇప్పుడు సుచిత్ర లీక్ చేసింది. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా సుచిత్ర తీరుపై అంతటా ఆగ్రహం వ్యక్తమవుతోంది. గ‌త కొన్ని రోజులుగా సెల‌బ్రిటీల ల‌వ్ ఎఫైర్స్‌, ప‌ర్స‌న‌ల్ ఫోటోస్ ఆన్‌లైన్‌లో పెడుతూ సంచ‌నాలు సృష్టిస్తున్న ఆమె ధనుష్‌ – త్రిష, సంగీత దర్శకుడు అనిరుద్‌ – హీరోయిన్‌ ఆండ్రియా.. తాజాగా రానా – త్రిష, బుల్లితెర నటి దివ్యదర్శిని ఓ యువకునితో సన్నిహితంగా ఉన్న దృశ్యం… ఇలా ఎన్నో సంచలన ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసి దానికి ‘ఇవి వారి రాసలీలలు’ అంటూ ట్యాగ్‌ లైన్ ఇచ్చేస్తుంది.  దీంతో ఆమె భర్త, నటుడు కార్తీక్ కుమార్ కాస్త టెన్షన్ పడుతున్నారట. ఆమెను ఎవరైనా ఏమైనా చేస్తారని భయపడుతున్నారట.

దీంతో ఆయన త‌న భార్య సుచిత్ర‌ మానసిక రోగంతో బాధపడుతోందని చెబుతున్నారు.  ఆమెకు విడాకులు ఇవ్వాలని తాను భావించడం లేదని, ఆ వార్తలు వదంతులేనని చెబుతూ, సుచిత్రకు మానసిక సమస్యలున్నాయని అన్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ లో ఓ పోస్టును పెట్టారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు