ప్రభాస్ కోసం ఒకరు కాదు ఇద్దరు..

ప్రభాస్ కోసం ఒకరు కాదు ఇద్దరు..

నాలుగేళ్ల పాటు 'బాహుబలి'కి అంకితమైపోయిన ప్రభాస్.. ఈ మధ్యే ఆ చిత్రం నుంచి బయటికి వచ్చాడు. తన కొత్త సినిమాకు సన్నాహాలు మొదలుపెట్టాడు. సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ చేయబోయే సినిమాకు ఆల్రెడీ ప్రారంభోత్సవం కూడా కానిచ్చేశారు. ఇక సినిమా సెట్స్ మీదికి వెళ్లడమే తరువాయి.

ఈ సినిమాలో హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కెన్నీ బేట్స్ ఆధ్వర్యంలో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. దాన్నే ముందుగా పూర్తి చేసి.. 'బాహుబలి: ది కంక్లూజన్' విడుదల సమయానికి ఒక చిన్న టీజర్ కూడా లాంచ్ చేయాలన్న ఆలోచనలో ఉంది చిత్ర బృందం.

ఇక ఈ చిత్రానికి సంబంధించి నటీనటులు.. సాంకేతిక నిపుణుల ఎంపిక కూడా తుది దశలో ఉంది. ప్రభాస్ కు దీటైన విలన్ కోసం ఏడాదిగా ఆలోచిస్తున్న సుజీత్.. చివరికి వివేక్ ఒబెరాయ్ ను ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. 'రక్తచరిత్ర' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించాడు వివేక్. ఆ తర్వాత కొన్ని సినిమాలకు అతడి పేరు పరిశీలించారు కానీ.. వర్కవుట్ కాలేదు. ఐతే ప్రభాస్ సినిమా తెలుగు.. తమిళం.. హిందీ భాషల్లో తెరకెక్కుతున్న నేపథ్యంలో వివేక్ అయితే బాగా వర్కవుటవుతుందని భావించిన అతణ్ని ఓకే చేసినట్లు సమాచారం. వివేక్ కూడా ఈ ప్రాజెక్టుకున్న క్రేజ్ చూసి ఇమ్మీడియట్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. అతను తమిళంలో 'వివేగం' సినిమాతో ఈ ఏడాదే ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మరోవైపు ఈ చిత్రం ఇంకో బాలీవుడ్ హీరో కూడా విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ఆయనే జాకీష్రాఫ్.

ఈ సీనియర్ నటుడిది కూడా సినిమాలో కీలక పాత్రేనట. ఇంతకుముందు 'కత్తి'లో నటించిన నీల్ నితిన్ ముకేశ్‌ను విలన్ పాత్రకు తీసుకోవాలనుకున్నారు కానీ.. అతను తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేకపోవడంతో ఆ స్థానంలో వివేక్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర హీరోయిన్ సంగతే ఇంకా ఖరారవ్వలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు