ఇక్కడ ఎన్టీఆర్‌, అక్కడేమో అతను!

ఇక్కడ ఎన్టీఆర్‌, అక్కడేమో అతను!

హీరోలు ద్విపాత్రాభినయం చేసే కథలు తరచుగా కుదురుతుంటాయి కానీ త్రిపాత్రాభినయం మాత్రం చాలా అరుదు. ఇంతవరకు త్రిపాత్రాభినయం చేసిన హీరోలని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. చాలా అరుదైన అలాంటి కథలు ఒకేసారి రెండు భాషల్లో రెండు కుదరడం, ఆ రెండిట్లోను ఆయా భాషలకి చెందిన స్టార్‌ హీరోలు నటించడం విశేషమే. 'జై లవకుశ' చిత్రంలో ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం చేస్తోన్న సంగతి తెలిసిందే.

కె.ఎస్‌. రవీంద్ర డైరెక్షన్‌లో రూపొందుతోన్న ఈ చిత్రం ఆగస్టులో విడుదల కానుంది. భారీ నిర్మాణాత్మక విలువలతో దీనిని కళ్యాణ్‌రామ్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. తెలుగులో ఎన్టీఆర్‌ ట్రిపుల్‌ రోల్‌ చేస్తోంటే, తమిళంలో విజయ్‌ కూడా అలాంటి కథకే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. తనతో 'తెరి' చిత్రాన్ని తీసిన అట్లీ దర్శకత్వంలో విజయ్‌ మరో చిత్రం చేస్తున్నాడు. ఇందులో విజయ్‌ తండ్రిగా, ఇద్దరు కొడుకులుగా త్రిపాత్రాభినయం చేయబోతున్నాడనే వార్త అభిమానులకి కిక్‌ ఇస్తోంది.

తమ హీరోని ఒక క్యారెక్టర్‌లో చూస్తేనే అభిమానులకి కనుల పండుగలా వుంటుంది. ఇక అలాంటిది ఒకేసారి మూడేసి క్యారెక్టర్లలో కనిపిస్తే ఇక వాళ్లకి ఉత్సవమే కదా. కథల సంగతి ఎలా వున్నా ఈ ట్రిపుల్‌ రోల్‌ ధమాకాతో ఈ సినిమాలు పాస్‌ అయిపోతాయనేది ట్రేడ్‌ నమ్మకం కూడా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు