ఇక అతడిని నమ్ముకుంటే మటాషే

ఇక అతడిని నమ్ముకుంటే మటాషే

బిచ్చగాడు చిత్రం ఏదో ఫ్లూక్‌లో క్లిక్‌ అయ్యేసరికి ఇక విజయ్‌ ఆంటోని ఏదో పెద్ద స్టార్‌ అన్నట్టు మన బయ్యర్లు అతడి సినిమాలని ఎగబడి కొనేస్తున్నారు. బిచ్చగాడుకి లాటరీ తగిలింది కనుక కాలం కలిసి వస్తే ఇంకో బంపర్‌ లాటరీకి విజయ్‌ ఆంటోని హెల్పవుతాడని ఆశిస్తున్నారు. కానీ అతనికి బయ్యర్లలో వచ్చిన క్రేజ్‌, బిచ్చగాడితో జనాల్లో రాలేదు. ఆ చిత్రం కథ బాగుందని చూసారు కానీ దాంట్లో హీరో బాగున్నాడని చూడలేదు కదా.

ఈ చిన్న లాజిక్‌ మిస్‌ అయిన బయ్యర్లు వరసగా రెండుసార్లు బుక్‌ అయిపోయారు. భేతాళుడు ఫ్లాప్‌ కాగా, యమన్‌ చిత్రానికి నామమాత్రపు ఓపెనింగ్స్‌ కూడా రాలేదు. బిచ్చగాడు స్లోగా పిక్‌ అయింది కనుక ఇదీ అలా జరుగుతుందేమోనని ఎదురు చూసారు కానీ అది జరగకపోవడంతో నెత్తిన తెల్ల గుడ్డ వేసుకున్నారు. ఒక సినిమాని చూసి వేలం వెర్రిగా కొనేస్తే ఏం జరుగుతుందనే దానికి ఇది చక్కని ఉదాహరణ.

తెలుగులో మార్కెట్‌ వుందని విజయ్‌ ఆంటోని సినిమాలపై మామూలుగా పెట్టే దానికంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. అయితే రచన మీద పెట్టే శ్రద్ధ తగ్గిపోయేసరికి అతని చిత్రాలు వర్కవుట్‌ అవడం లేదు. తన చిత్రాలు చూసేది కథ కోసమేనని, తనని చూడ్డానికి రావడం లేదని విజయ్‌ ఆంటోని గుర్తించకపోతే, సడన్‌గా వచ్చిన సక్సెస్‌ అంతే సడన్‌గా మాయమై మళ్లీ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా మిగిలిపోవాల్సి వస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు