న్యూడ్‌ సీన్‌ లీక్‌... నిర్మాతల పనేనా?

న్యూడ్‌ సీన్‌ లీక్‌... నిర్మాతల పనేనా?

వార్తల్లో లేని, గుర్తింపు రాని చిన్న చిత్రాలవైపు జనం దృష్టిని మరల్చడానికి సంచలనం ఏదైనా చేయడమనేది ఎప్పట్నుంచో వున్న పాత టెక్నిక్కే. అలాగే 'అనార్కలి ఆఫ్‌ ఆరా' అనే బాలీవుడ్‌ చిత్రంలోని డిలీటెడ్‌ సీన్లు కొన్ని ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమయ్యాయి.

సెన్సార్‌ బోర్డు అభ్యంతరం చెప్పి తొలగించిన సీన్లు పబ్లిక్‌ అయ్యేసరికి 'ఇదెవరు చేసారో కనుక్కునే వరకు ఊరుకోం' అంటూ నిర్మాతలు బింకాలు పలుకుతున్నారు. 'ఇలాంటి సన్నివేశాలని లీక్‌ చేయడం వల్ల సినిమాపై చెడు భావన వస్తుంది. ఆ సన్నివేశాలు కథలో భాగంగా వస్తాయే తప్ప సంచలనం కోసం చేసినవి కావు' అంటూ కథానాయిక స్వర భాస్కర్‌ చెప్తోంది. అయితే ఇదంతా కేవలం పబ్లిసిటీ కోసం ఆడుతోన్న డ్రామా అని చిన్న పిల్లలకి కూడా అర్థమైపోతుంది.

సెన్సార్‌ అభ్యంతరం చెప్పిన దృశ్యాలని మాత్రమే కట్‌ చేసి, వాటన్నిటినీ కలిపి ఒక వీడియోగా వదిలారు. అదిప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌ అయిపోయింది. ఇంతవరకు ఎవరూ మాట్లాడుకోని ఈ చిత్రం ఒక్కసారిగా చాలా మందికి తెలిసింది. కానీ ఇది ఎవరో గిట్టని వాళ్లే చేసారంటూ నిర్మాతలు అమాయకంగా మాట్లాడుతున్నారు. ఆ క్లిప్పింగ్‌లో స్వర భాస్కర్‌ని కొందరు మగాళ్లు అబ్యూజ్‌ చేస్తోన్న దృశ్యాలు, ఆమె అర్థ నగ్నంగా వెనక్కి తిరిగి నిలబడిన దృశ్యం వున్నాయి.

ఇంటర్నెట్‌లో వైరల్‌ అయిపోవడానికి ఈమాత్రం విషయం చాలుగా. అయితే ఇలాంటి గిమ్మిక్కుల వల్ల ప్రచారం వస్తుంది కానీ వ్యాపారం జరగదని ఇటీవల చాలా చిత్రాలకి రుజువైంది. అయినప్పటికీ నిర్మాతలు తమ ప్రయత్నాలైతే మానట్లేదనుకోండి. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు