అమ్మడంటే పడి చచ్చిపోతున్నారు

అమ్మడంటే పడి చచ్చిపోతున్నారు

ఇంతవరకు దిశా పటానీ ఖాతాలో చెప్పుకోతగ్గ బ్లాక్‌బస్టర్‌ లేదు. ధోని బయోపిక్‌లో చిన్న క్యారెక్టర్‌ మినహా ఆమెకి కెరియర్‌ పరంగా అద్భుతాలేమి జరగలేదు. ఇటీవలే వచ్చిన జాకీచాన్‌ సినిమా కూడా పల్టీ కొట్టేయడంతో దిశా పటాని కొత్త ఆఫర్ల కోసం ఎదురు చూస్తోంది. యాడ్స్‌తో, వీడియో సాంగ్స్‌తో ఇప్పటికే పాపులర్‌ అయిన దిశాకి ఫాన్‌ ఫాలోయింగ్‌ నానాటికీ పెరిగిపోతోంది. హీరోయిన్లు అయితే సన్నగా, లేదా బొద్దుగా వుంటారే తప్ప సన్నగా వుంటూ ఒంపుసొంపులన్నీ తీర్చిదిద్దినట్టుండే వాళ్లు చాలా అరుదు.

ఆ కేటగిరిలోకి దిశా చేరుతుంది కనుకే ఆమెకి ఇంతటి క్రేజ్‌ అని విశ్లేషకులు భావిస్తున్నారు. పైగా తన ఒంపుసొంపులని ఆమె దాచుకోకుండా ఆరబోస్తుంది. ఆమె అందం ఎంత పిచ్చెత్తిస్తుందంటే, దిశా పక్కన కూర్చున్న ఒక యువకుడు ఆమె అందాల వైపుకి తదేకంగా చూడకుండా వుండలేకపోయాడు. పబ్లిక్‌ ఫంక్షన్‌ అని, ఫోటోలు తీస్తున్నారని కూడా లేకుండా అతను ఆమె క్లీవేజ్‌కే కళ్లు అప్పగించేసి వైరల్‌ అయిపోయాడు.

స్టార్‌ హీరోయిన్లతో సమానంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్‌ని సంపాదించుకున్న దిశాకి బ్లాక్‌బస్టర్‌, స్టార్‌ స్టేటస్‌ లేకుండానే క్రేజ్‌ ఇలాగుందంటే ఆమెకి ఏ ఖాన్‌తోనో సినిమా ఓకే అయిందంటే అప్పుడిక ఏ రేంజ్‌లో రెచ్చిపోతుందో కదూ?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు