రాజమౌళి వున్నా లేకున్నా ప్రభాస్‌ రేంజ్‌ మాత్రం తగ్గకూడదు

రాజమౌళి వున్నా లేకున్నా ప్రభాస్‌ రేంజ్‌ మాత్రం తగ్గకూడదు

'బాహుబలి' తర్వాత ప్రభాస్‌ మళ్లీ మునుపటిలా మామూలు బడ్జెట్‌ సినిమాలే చేస్తాడని అనుకున్నారు కానీ, బాహుబలి కోసం నాలుగేళ్లు కష్టపడి, జాతీయ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని, దానిని మొత్తం వృధా చేస్తూ మళ్లీ తెలుగు మార్కెట్‌కే ఎందుకు పరిమితం కావాలని ప్రభాస్‌ కోటరీ ఆలోచించింది. ఏ హీరోకో గానీ రాని అవకాశం ప్రభాస్‌కి వచ్చింది కనుక ఇకపై బాహుబలి పునాదులపై ప్రభాస్‌ సూపర్‌స్టార్‌డమ్‌ నిర్మించాలని డిసైడ్‌ అయింది.

రాజమౌళితో గతంలో చేసిన హీరోలు నెక్స్‌ట్‌ సినిమాలకి మళ్లీ రొటీన్‌ ట్రాక్‌ పట్టేసారు. ఛత్రపతి తర్వాత ప్రభాస్‌ మళ్లీ అలాంటి పవర్‌ఫుల్‌ పాత్రలు చేయలేదు. దాంతో తనతో పాటు చాలా మంది రాజమౌళి ఇచ్చిన స్టార్‌డమ్‌ని క్యాష్‌ చేసుకోలేకపోయారు. ఆ కిటుకు కనిపెట్టిన ప్రభాస్‌ వర్గం బాహుబలి తర్వాత ఆ తప్పు రిపీట్‌ చేయకూడదని, ప్రభాస్‌ని ఇక మళ్లీ కిందకి దిగనివ్వవద్దని, రాజమౌళి వున్నా లేకపోయినా అతని రేంజ్‌ మాత్రం తగ్గకూడదని తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది.

అందుకే ఇప్పుడు ప్రభాస్‌తో అంత భారీ యాక్షన్‌ సినిమాకి శ్రీకారం చుడుతోంది. అయితే ఈ క్రమంలో కథల మీద ఫోకస్‌ తగ్గకూడదు. గ్రాండియర్‌ మీదే దృష్టి పెట్టి మిగతావి వదిలేస్తే బాహుబలి ఇచ్చిన కిక్‌ వదిలిపోవడానికి ఆట్టే సమయం పట్టదు. కనీసం మరో మూడు, నాలుగేళ్ల వరకు ప్రభాస్‌ పెడల్‌ మీది నుంచి కాలు తీయకుండా తొక్కుతూనే వుంటే ఇక మిగతా హీరోలకి అందనంత ఎత్తుకి వెళ్లిపోతాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు