చిరంజీవి చేతులెత్తేసినట్టేనా?

చిరంజీవి చేతులెత్తేసినట్టేనా?

'మీలో ఎవరు కోటీశ్వరుడు' షో మొదలై రెండు వారాలు దాటింది. అయితే ఇంతవరకు ఈ షోకి ఆదరణ పెరుగుతోన్న దాఖలాలు కనిపించడం లేదు. చిరంజీవి వ్యాఖ్యాతగా వ్యవహరించడంతో ఈ షో కొత్త చరిత్ర సృష్టిస్తుందని, టెలివిజన్‌ రంగంలో కనీ వినీ ఎరుగని టీఆర్పీలు తెచ్చి పెడుతుందని స్టార్‌ మా ఆశించింది. కానీ ఇప్పటికే పాతబడిపోయిన ఈ గేమ్‌ షో పట్ల జనం ఆసక్తి చూపించడం లేదు.

టీవీలో ఎప్పటికప్పుడు ఫ్రెష్‌ థాట్స్‌తో ముందుకు రావాలి. ఏ గేమ్‌ షో అయినా ఎక్కువ కాలం నిలబడదు. అందుకే తరచుగా కొత్త గేమ్‌ షోలని ఇంట్రడ్యూస్‌ చేస్తుంటారు. కామెడీ, డాన్స్‌, పాటలకి సంబంధించినవి అయితే ఎప్పటికప్పుడు క్రియేటివిటీకి, కొత్త టాలెంట్‌కి స్కోప్‌ వుంటుంది కనుక అలాంటివాటికి మనుగడ ఎక్కువ వుంటుంది. కానీ గేమ్‌ షోలు, అందునా కూర్చుని క్విజ్‌ క్వశ్చన్లకి చెప్పే సమాధానాలకి జనాకర్షణ తగ్గిపోవడం సహజం.

చిరంజీవి ఎంట్రీతో ఈ షో మళ్లీ పుంజుకుంటుందని అనుకున్నారు కానీ ఎంత మెలోడ్రామా పండించినా, ఎంతగా వినోదం కోసం ప్రయత్నించినా మీలో ఎవరు కోటీశ్వరుడు వెనకబడిపోతోంది. ఈ సీజన్‌ క్లిక్‌ అయితే మరో రెండు సీజన్లు చేద్దామని చిరంజీవి భావించారు. కానీ ఈ సీజన్‌కి వస్తోన్న రెస్పాన్స్‌తో చిరంజీవి తిరిగి ఇది చేయడానికి ఉత్సాహం చూపించకపోవచ్చు. మొత్తం అరవై ఎపిసోడ్లు వుండే ఈ సీజన్‌ మొత్తం కంప్లీట్‌ అయిన తర్వాత ఇది కొనసాగించాలా, లేక పూర్తిగా కాల్‌ ఆఫ్‌ చేయాలా అనేదానిపై స్టార్‌ మా ఒక నిర్ణయం తీసుకుంటుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు