మళ్లీ రాముడి గూటికే చేరాడు

మళ్లీ రాముడి గూటికే చేరాడు

'నేను శైలజ' చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ సాధించిన కిషోర్‌ తిరుమల మలి చిత్రాన్ని వెంకటేష్‌తో చేయాల్సి వుంది. 'ఆడాళ్లూ మీకు జోహార్లు' అనే సినిమా అనౌన్స్‌ అయింది, ఆరుగురు హీరోయిన్లుంటారని వార్తలు వచ్చాయి.

కానీ వెంకీ ఆ చిత్రం చేయడానికి ఆసక్తి చూపించకపోవడంతో కిషోర్‌ వేరే హీరోల దగ్గరకి వెళ్లాడు. నితిన్‌ని కలిసి ఒక కథ చెప్పాడు. అతను కథ విని వర్క్‌ చేయమని చెప్పిన తర్వాత హను రాఘవపూడి వెళ్లి నితిన్‌కి కథ చెప్పాడు. నితిన్‌కి అతని చాలా బాగా నచ్చేయడంతో కిషోర్‌ కథని హోల్డ్‌లో పెట్టాడు. దీంతో కిషోర్‌ తిరిగి రామ్‌ దగ్గరికే వచ్చాడు. కరుణాకరన్‌తో చేద్దామని డిసైడ్‌ అయిన రామ్‌ ఆ సినిమాని పక్కనపెట్టి 'నేను శైలజ' డైరెక్టర్‌తోనే చేయడానికి సై అన్నాడు. ఈ చిత్రంలో రామ్‌ సరికొత్త లుక్‌తో కనిపించబోతున్నాడు. రామ్‌ పెంచిన గడ్డం, జుట్టుతో పాటు అతను చేసిన సిక్స్‌ ప్యాక్‌కి అనుగుణంగా తన హీరో పాత్రని కిషోర్‌ మలచుకుంటున్నాడట.

అలరించే ప్రేమకథతో వచ్చిన ఈ ద్వయం ఈసారి యాక్షన్‌తో దుమ్ము దులపడానికి సిద్ధమవుతోందన్నమాట. ఇంకా ఈ చిత్రంలో నటించే హీరోయిన్‌, తదితర విషయాలేమీ తెలియవు కానీ దీనిని స్రవంతి మూవీస్‌ బ్యానర్‌పై నిర్మించబోతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English