ఆ హీరోకి సినిమాల్లేవ్‌

ఆ హీరోకి సినిమాల్లేవ్‌

సాయికుమార్‌ తనయుడు ఆదికి మొదట్లో వరుసపెట్టి ఆఫర్లు వచ్చాయి కానీ ఇప్పుడు తన చేతిలో అసలు ఒక్క ఆఫర్‌ కూడా లేదు. వరుస పరాజయాలతో ఆదిపై నిర్మాతలు నమ్మకాన్ని కోల్పోయారు. సాయికుమార్‌ అనుభవం కూడా ఆదిని రైట్‌ ట్రాక్‌లో పెట్టలేకపోయింది. పైగా ఒక చిత్రానికి సాయికుమార్‌ నిర్మాతగా మారాల్సి రావడం వల్ల కొడుకుపై సొంత డబ్బే పోగొట్టుకోవాల్సి వచ్చింది. దీంతో ఆదిని హీరోగా నిలబెట్టమంటూ సాయికుమార్‌ తనకి తెలిసిన నిర్మాతలు అందరినీ అడుగుతున్నాడట.

ఆదికి పారితోషికం అవసరం లేదని, మంచి సినిమా తీసి అతడిని మళ్లీ ట్రాక్‌ మీద పెట్టమని అంటున్నాడట. చిరంజీవితో, అల్లు అరవింద్‌తో మాట్లాడాడని, గీతా ఆర్ట్స్‌2పై అరవింద్‌ తీస్తోన్న సినిమాల్లో ఒకటి ఆదితో తీయమంటూ రిక్వెస్ట్‌ చేసాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే దిల్‌ రాజుని, యువి క్రియేషన్స్‌ వారిని కూడా సాయికుమార్‌ కలిసి మాట్లాడాడట. ప్రస్తుతం చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోవడంతో ఆది కూడా డిప్రెస్‌ అవుతున్నాడనే రూమర్లు వున్నాయి.

పెద్ద పెద్ద హిట్లు కొట్టిన వరుణ్‌ సందేశ్‌ లాంటి హీరోలే ఇప్పుడు ఖాళీగా వుంటున్నారు. సరైన కథలు ఎంచుకోకుండా ఆదిలోనే మాస్‌ హీరో అయిపోదామంటూ చేసిన ప్రయత్నం బెడిసికొట్టి ఆది ఇలా ఖాళీగా మిగిలిపోయాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు