ఏడేళ్ల తరువాత ఐష్, అభిషేక్ స్క్రీన్ రొమాన్స్ ?

ఏడేళ్ల తరువాత ఐష్, అభిషేక్ స్క్రీన్ రొమాన్స్ ?

అందాల‌తార  ఐశ్వర్యరాయ్‌, ఆమె భర్త అభిషేక్‌బ‌చ్చ‌న్  మళ్లీ కలిసి నటించనున్నట్లు సమాచారం. ప్రముఖ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ నేతృత్వంలోని ఫాంటమ్‌ ఫిలింస్‌ వీరిద్దరితో ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు  బాలీవుడ్‌లో  గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే ఏడేళ్ల తర్వాత అభి, ఐష్‌ దంపతులు నటిస్తున్న చిత్రం ఇదే కావచ్చు.  ఈ చిత్రానికి  గులాబ్‌జామున్  అని పేరు పెట్టనున్నట్లు వినిపిస్తోంది.

గతంలో అభిషేక్‌ రావణ్‌ సెట్లో ఐష్‌తో కలిసి ఉన్న ఫొటోను తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. దీంతో వారిద్దరూ మళ్లీ జంటగా తెరపై కనిపిస్తున్నారని అభిమానులు ఆశిస్తున్నారు.

కాగా గత ఏడాది అభిషేక్, ఐశ్వర్యల మధ్య విభేదాలు వచ్చాయన్న వార్తలొచ్చాయి. ఏ దిల్ హే ముష్కిల్ సినిమాలో ఐశ్వర్యరాయ్ రెచ్చిపోయి నటించడంతో అభిషేక్ ఫీలయ్యాడని ప్రచారం జరిగింది.  అయితే అప్పట్లో అభిషేక్ మాత్రం ఆ ప్రచారాన్ని ఖండిస్తూ ఐష్ అందాలను పొగిడాడు. ఐష్ హేవ్ స్టన్నింగ్ లుక్స్ అంటూ అభిషేక్ మెచ్చుకోవడంతో అంతా అవాక్కయ్యారు కూడా.

ఐశ్వర్యరాయ్ చాలా అందంగా ఉందని, ఆమెను అంత అందంగా తను కూడా ఎప్పుడూ చూడలేదని అభిషేక్ అంటుంటే ప్రెస్ వాళ్లు ముక్కున వేలేసుకున్నారు. తన భార్య ఎక్స్ పోజింగ్ చేస్తే మీకేంటి ప్రాబ్లమ్ అనే రేంజ్ లో అబిషేక్ మాట్లాడాడట. దీంతో ఇక ఎవ్వరూ ఏ ప్రశ్నలు అడగలేకపోయారు.  అదంతా ఎలా ఉన్నా ఇప్పుడు వీరిద్దరు కలిసి నటించబోయే సినిమాలోనూ ఐష్ అందాలు ఆరబోస్తే చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు