‘ఘాజీ’ ఆ రేంజికి వెళ్లిపోయింది

‘ఘాజీ’ ఆ రేంజికి వెళ్లిపోయింది

మొత్తానికి దగ్గుబాటి రానా అండ్ కో చేసిన సాహసం మంచి ఫలితాన్నే ఇచ్చింది. ఇండియాస్ ఫస్ట్ వార్ అట్ సీ ఫిల్మ్ ‘ఘాజీ’ సూపర్ హిట్ రేంజికి చేరుకుంది. ఫెంటాస్టిక్ రివ్యూలతో.. అదిరిపోయే మౌత్ టాక్‌తో మొదలైన ఈ సినిమా తొలి రోజు నుంచి మంచి వసూళ్లతో దూసుకెళ్లింది. రెండో వీకెండ్లోనూ మంచి కలెక్షన్లు రాబట్టడంతో బయ్యర్లు లాభాలు అందుకున్నారు. ‘ఘాజీ’ చూడ్డానికి భారీ బడ్జెట్ మూవీలా అనిపిస్తుంది కానీ.. దాని మీద పెట్టిన పెట్టుబడి కేవలం రూ.15 కోట్లు. ఐతే ఈ చిత్రం తొలి పది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.21.5 కోట్లు వసూలు చేసింది. అమెరికాలో ఈ చిత్రం ఇప్పటిదాకా 6.5 లక్షల డాలర్లకు పైగా వసూలు చేయడం విశేషం.

ఏరియాల వారీగా మూడు భాషల్లో కలిపి ‘ఘాజీ’ తొలి పది రోజుల షేర్స్ ఎలా ఉన్నాయంటే..

నైజాం-రూ.3.6ట్లు
సీడెడ్‌-రూ.59 లక్షలు
వైజాగ్ (ఉత్త‌రాంధ్ర‌)-రూ.1.14 కోట్లు
గుంటూరు-రూ.61 లక్షలు
కృష్ణా- రూ.71 లక్షలు
ప‌శ్చిమ‌గోదావ‌రి-రూ.36 లక్షలు
తూర్పు గోదావ‌రి-రూ.50 లక్షలు
నెల్లూరు-రూ.24 లక్షలు
క‌ర్ణాట‌క‌-రూ.1.8 కోట్లు
తమిళనాడు-రూ.2.05 కోట్లు
రెస్టాఫ్ ఇండియా- రూ.7.3 కోట్లు
యుఎస్‌- రూ.1.82 కోట్లు
మిగతా ఏరియాల్లో- రూ.60 లక్షలు
ఏపీ-తెలంగాణ షేర్ రూ.7.75 కోట్లు
వ‌ర‌ల్డ్ వైడ్ షేర్- రూ.21.32 కోట్లు

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English