బండ్లకు బొత్స చేసిన ఏకైక సాయం

బండ్లకు బొత్స చేసిన ఏకైక సాయం

చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకుంటూ వచ్చిన బండ్ల గణేష్ ఉన్నట్లుండి పెద్ద నిర్మాత అయిపోయాడు. సడెన్ గా అలా ఎలా ఎదిగిపోయాడో ఎవరికీ అర్థం కాలేదు. ఆ సమయంలో బండ్ల మీద వచ్చిన పెద్ద ఆరోపణ.. మాజీ మంత్రి బొత్సా సత్య నారాయణకు అతను బినామీ అని. ఆయన డబ్బులతోనే అతను సినిమాలు తీస్తున్నాడని పెద్ద ప్రచారమే జరిగింది. ఐతే ఇది శుద్ధ అబద్ధమని అంటున్నాడు బండ్ల. బొత్సకు తాను సన్నిహితుడిని మాత్రమే అని.. తమ మధ్య వ్యాపార లావాదేవీలేమీ లేవని బండ్ల అన్నాడు. బొత్సకు బినామీ అనే ప్రచారం వల్ల తాను చాలా ఇబ్బంది పడ్డానని.. దీని వల్ల తన తల్లి ఏడ్చే వరకు పరిస్థితి వెళ్లిందని తాజాగా ఒక ఇంటర్వ్యూలో బండ్ల చెప్పాడు.

‘‘అసలీ ప్రచారం ఎందుకు మొదలైందో తెలియదు. నాకు మాగంటి బాబు గారి ద్వారా బొత్స సత్యనారాయణ గారు పరిచయం. ఆయన ఇంటి దగ్గర తరచుగా కలుస్తుండే వాళ్లం. తర్వాత ఆయనకు దగ్గరయ్యాను. అప్పట్లో ఒక భూమికి సంబంధించిన ఇబ్బంది ఉంటే ఓ ఐఏఎస్ అధికారికి చెప్పి నాకు సాయం చేశారు. నాకు ఆయన చేసిన ఏకైక సాయం అదొక్కటే. అంతకుమించి మా మధ్య ఎలాంటి ఆర్థిక బంధం లేదు. బొత్స గారి ఫ్యామిలీలోనే వంద మంది ఉన్నారు. వాళ్లందరినీ కాదని ఆయన నా చేతికి డబ్బులిచ్చి ఎందుకు పెట్టబడులు పెట్టిస్తారు. నేనైతే అలా చేయను. నాకెవరైనా ఇస్తే తీసుకుంటాను కానీ.. నేను మాత్రం ఇవ్వను. ఒక వేడుకలో ‘నేను మర్డర్ చేసినా బొత్స గారు కాపాడతారు’ అనే మాట అన్నాను. వేదిక దిగాక తెలిసింది ఆ మాట చాలా తప్పని. దాని వల్ల పదేళ్లు ఇబ్బంది పడ్డాను. బొత్స గారికి బినామీ అనే ప్రచారం ఒక టైంలో బాగా ఎక్కువైపోవడంతో మా అమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. ఏంట్రా ఇలా అంటున్నారు అని. దీంతో ఆయన దగ్గరకు వెళ్లడం మానేశాను. ఐదేళ్లుగా ఆయన్ని కలవట్లేదు. అయినా ఆ ప్రచారం మాత్రం ఇంకా ఆగట్లేదు’’ అని బండ్ల గణేష్ తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English