రాజమౌళి డిఫెన్స్‌లో పడిపోయాడు

రాజమౌళి డిఫెన్స్‌లో పడిపోయాడు

'బాహుబలి' తర్వాత రాజమౌళి తీసే సినిమా కోసం దేశం మొత్తం ఎదురు చూస్తుంది. దీనికంటే తక్కువ స్కేల్‌ వున్న సినిమా ఏమి తీసినా కానీ రాజమౌళి రేంజ్‌కి ఇదేమి సినిమా అంటూ పెదవి విరిచే అవకాశముంది. ఆ సంగతి రాజమౌళి కూడా గ్రహించాడు. అందుకే తన తదుపరి చిత్రంపై తొందర పడడం లేదు. మగధీర విడుదలకి ముందే 'మర్యాద రామన్న' చేయాలని, ఆ తర్వాత 'ఈగ', 'బాహుబలి' తియ్యాలని రాజమౌళి ఎప్పటికప్పుడు తన తదుపరి చిత్రాలని లైన్లో పెట్టి వుంచేవాడు. కానీ ఇప్పుడతనికి నెక్స్‌ట్‌ మూవీపై క్లారిటీ లేదు. ఇంతకుముందు గరుడ అని, ఈగ 2 అని కొన్ని ఐడియాలున్నట్టు చెప్పేవాడు. కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా డిఫెన్స్‌లో పడ్డాడు.

తదుపరి చిత్రం గురించి ఇంకా ఏమీ ఆలోచించుకోలేదని, కొంత విరామం తీసుకున్న తర్వాతే ఆలోచిస్తానని అంటున్నాడు. మహాభారతం తీసేస్తాడేమో అనుకుంటే దానికి మరో పదేళ్లు పడుతుందని కూడా తేల్చి చెప్పాడు. ఏ హీరోతోను సంప్రదింపులు కూడా జరపకపోయే సరికి అసలు జక్కన్న మనసులో ఏముందో, నెక్స్‌ట్‌ సినిమా కోసం అతని మైండ్‌లో వున్న హీరో ఎవరో అర్థం కావడం లేదు. గ్రాఫిక్స్‌ సినిమాలతో బాగా ఒత్తిడి ఫేస్‌ చేసిన రాజమౌళి ఈసారి ట్రెండ్‌ మారుస్తాడని, అంతర్జాతీయ ప్రమాణాలతో యాక్షన్‌ సినిమా తీయవచ్చునని రూమర్స్‌ వినిపిస్తున్నాయి.

బాహుబలి కోసం అయిదేళ్లుగా అదే యజ్ఞంలా చేస్తోన్న రాజమౌళి అది పూర్తిగా మైండ్‌లోంచి బయటకి పోయే వరకు ఫ్రెష్‌ ప్రాజెక్ట్‌ మొదలు పెట్టకూడదని డిసైడైనట్టు అతని తరఫు వాళ్లు చెబుతున్నారు. మొత్తానికి కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడనే దానికంటే, రాజమౌళి నెక్స్‌ట్‌ ఎవరితో తీస్తాడనేదే ఎక్కువ సస్పెన్స్‌గా వుందిపుడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు