చ‌ర‌ణ్ సినిమా మిస్‌.. ఆమె రెస్పాన్స్ ఏంటంటే?

చ‌ర‌ణ్ సినిమా మిస్‌.. ఆమె రెస్పాన్స్ ఏంటంటే?

అఆ, ప్రేమ‌మ్, శ‌త‌మానం భ‌వ‌తి.. ఆరు నెల‌ల వ్య‌వ‌ధిలో ఈ మూడు హిట్ల‌తో గోల్డెన్ లెగ్ అనిపించుకుంది మ‌ల‌యాళ భామ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌. ఈ ఊపులో రామ్ చ‌ర‌ణ్ లాంటి స్టార్ హీరో స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం ఆమెను వ‌రించింది. సుకుమార్ డైరెక్ష‌న్లో చ‌ర‌ణ్ చేయ‌బోయే సినిమాకు ఆమే హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ విష‌యాన్ని అనుప‌మ క‌న్ఫ‌మ్ చేసింది కూడా.

కానీ ఏమైందో ఏమో.. ఉన్న‌ట్లుండి ఆమెను ఈ సినిమా నుంచి త‌ప్పించేశారు. ఈ విష‌యంలో అనుప‌మ చాలా అప్సెట్ అయిన‌ట్లు వార్త‌లొచ్చాయి. అలాగే ఎన్టీఆర్ సినిమాకు కూడా అనుప‌మ‌ను క‌థానాయిక‌గా అనుకుని త‌ర్వాత మ‌న‌సు మార్చుకున్న‌ట్లు ఊహాగానాలు వినిపించాయి. తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో ఈ వార్త‌ల‌పై అనుప‌మ వివ‌ర‌ణ ఇస్తూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.

‘‘రామ్ చ‌ర‌ణ్ సినిమా ఆల్మోస్ట్‌ ఓకే అనుకుంటున్న సమయంలో చేజారిపోయింది. ఒక పెద్ద సినిమా మిస్స‌యినప్పుడు క‌చ్చితంగా బాధ ఉంటుంది. కానీ ఏదీ మన చేతుల్లో ఉండదు కదా. ఆ సినిమా  చేజారినా.. ఆ చిత్ర దర్శక–నిర్మాతలతో నాకు మంచి సంబంధాలే ఉన్నాయి. రామ్ చరణ్‌ మంచి వ్య‌క్తి.  ఛాన్స్‌ ఇస్తే మంచివాళ్లు.. ఇవ్వకపోతే చెడ్డవాళ్లు అనుకునే టైపు కాదు నేను.  నా వ‌య‌సు 21 ఏళ్లే. భ‌విష్య‌త్తులో చ‌ర‌ణ్‌తో పాటు చాలా మంది హీరోల‌తో న‌టించే అవ‌కాశముంటుంద‌ని అనుకుంటున్నా.  ఇక ఎన్టీఆర్ సినిమా విష‌యానికి వ‌స్తే.. ఆ యూనిట్‌ వాళ్లెవరూ నన్ను సంప్రదించలేదు. నాకు అందులో ఛాన్స్ మిస్స‌యింద‌న్న వార్త‌ల్లో వాస్త‌వం లేదు’’ అని అనుప‌మ తెలిపింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు