మీనా కూతురి నటనకు మార్కులే మార్కులు

మీనా కూతురి నటనకు మార్కులే మార్కులు

బాలనటిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమై ఆ తరువాత టాప్ హీరోయిన్ అయిన మీనా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగులో అందరూ పెద్ద హీరోలతో సూపర్ హిట్లు కొట్టిన మీనా పెళ్లి చేసుకున్న తరువాత సినిమాలకు దూరమైనా మళ్లీ పలు సినిమాల్లో నటిస్తోంది. ఇప్పుడు ఆమె తాన వారసులను కూడా రంగంలోకి దించేసింది. ఆమె కుమార్తె నైనిక వరుస సినిమాలతో హల్ చల్ చేస్తోంది.
   
త‌మిళ హీరో ఇళయదళపతి విజయ్, అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన తేరి చిత్రంలో విజయ్ కూతురిగా మీనా కుమార్తె నైనిక నటించింది. ఈ చిత్రంలో నైనిక పాత్ర చాలా డిఫరెంట్‌గా మనస్సుకు హత్తుకు పోయేలా ఉందట. దాదాపు 40 సీన్లలో కనిపించిన ఈ చిన్నారి తన నటనతో అందరి ప్రశంసలు అందుకుందని చెబుతున్నారు.
   
తాజాగా నైనిక రాస్కెల్ అనే తమిళ మూవీలో నటించ‌నుంది.. ఈ మూవీ మ‌ళ‌యాలం మూవీకి రీమేక్. అరవింద్ స్వామి, అమలాపాల్ ప్రధాన పాత్రలలో న‌టిస్తున్నారు. చక్రాల్లాంటి కళ్లతో, తన అభినయంతో ఆకట్టుకున్న మీనా తరహాలోనే నైనిక కూడా చక్కని అభినయం ప్రదర్శిస్తోందని దర్శకనిర్మాతలు చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు