అడ్డంగా బుక్కయిపోయిన శ్రుతి హాసన్

అడ్డంగా బుక్కయిపోయిన శ్రుతి హాసన్

అందాల భామ శ్రుతి హాసన్ ఖాళీగా ఉందంటే ఎవరైనా నమ్ముతారా...? సినిమాలు లేక ఖాళీగా ఉందంటే నమ్మేవారు ఉంటారేమో కానీ బాయ్ ఫ్రెండ్ లేకుండా ఖాళీ ఉందంటే అస్సలు నమ్మరు. కానీ.. అమ్మడు మాత్రం తాను ఖాళీ అంటోంది. తన ఎఫైర్లన్నిటినీ దాచాలని తెగ ట్రై చేస్తోంది. ఆమె ఎంతగా ట్రై చేస్తుంటే అంతగా బయటపడుతున్నాయా గుట్లన్నీ. తాజాగా బ్రిటన్ కు చెందిన  ఇంగ్లీష్ థియేటర్ ఆర్టిస్టు మైఖేల్ కోర్సెల్ తో తన ప్రేమ వ్యవహారం బయటపడిపోయింది.
  
 మైఖేల్ శ్రుతితో కలసి దిగిన ఓ చిత్రం ట్విట్టర్ లో హల్ చల్ చేస్తుండడంతో శ్రుతి మాటలను ఎవరూ నమ్మడం లేదు.  ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా, శ్రుతి కోసమే ప్రత్యేకించి వచ్చిన మైఖేల్, ముంబైలో ఆమెతో కలసి గడిపినట్టు తెలుస్తోంది. 'ఇండియాలో ఓ మంచి అమ్మాయితో చక్కటి సమయాన్ని గడిపాను. అందమైన స్నేహితుల బృందం ఇక్కడుంది. ఇండియా నాకు రెండో ఇల్లు' అని వ్యాఖ్యానిస్తూ, మైఖేల్ ఈ ఫోటోను పోస్టు చేశాడు.  దీంతో ఇద్దరూ ఎంతగా పెనవేసుకుపోతున్నారో అర్థమైపోతోంది.
  
 బ్రిటిష్‌ ఆల్టర్నేటివ్‌ రాక్‌ బ్యాండ్‌ లో ప్రదర్శన నిమిత్తం వెళ్లిన శ్రుతికి ఓ స్నేహితుడి ద్వారా మైఖేల్ పరిచయం కాగా, వీరిద్దరూ ప్రస్తుతం డేటింగ్‌ లో ఉన్నారు. శ్రుతి మాత్రం అదేమీ లేదంటోంది. శ్రుతి దాస్తున్నా మైఖేల్ మాత్రం అంతా బయటపెట్టేస్తున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు