కుమ్మి వదిలిన జూ|| చిరంజీవి

కుమ్మి వదిలిన జూ|| చిరంజీవి

అచ్చంగా యంగ్‌ ఏజ్‌లో చిరంజీవిలా వుంటాడంటూ కితాబులు అందుకుంటోన్న మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ బాక్సాఫీస్‌ పరంగా కూడా తన సత్తా చాటుకుంటున్నాడు. చేస్తున్నవి మధ్య శ్రేణి సినిమాలే అయినప్పటికీ అతని క్రేజ్‌ పెరుగుతూ పోతోంది. ఒక హీరో రేంజ్‌ని తెలియజెప్పే ఓపెనింగ్స్‌ పరంగా సాయి ధరమ్‌ తేజ్‌ కఠిన పరీక్షని పాస్‌ అయిపోయినట్టే.

 మిడిల్‌ రేంజ్‌లో హిట్లు ఇస్తున్న హీరోలు చాలా మందే వున్నారు కానీ ఓపెనింగ్స్‌ బాగా వచ్చే హీరో రవితేజ ఒక్కడే. ఇప్పుడా పొజిషన్‌ని సాయి ధరమ్‌ తేజ్‌ తీసుకున్నాడు. అతని తాజా చిత్రం విన్నర్‌ మొదటి రోజున ప్రపంచ వ్యాప్తంగా ఆరున్నర కోట్ల షేర్‌ వసూలు చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి అయిదు కోట్ల అరవై మూడు లక్ష్షలున్నాయి. తన గత చిత్రం కంటే దాదాపు రెండు కోట్ల ఎక్కువ షేర్‌ వసూలు చేసిన సాయి ధరమ్‌ తేజ్‌ మరి ఈ ఓపెనింగ్‌ బలంతో విన్నర్‌ని ఎంత దూరం లాగుతాడో చూడాలి.

టాక్‌ అయితే అనుకూలంగా లేదు కానీ ఓపెనింగ్స్‌ చూసిన బయ్యర్లు కంగారు పడ్డం లేదు. ఈ వారాంతానికి ఒక పదిహేను కోట్లు లాగేస్తే ఆ తర్వాత సేఫ్‌ జోన్‌కి వెళ్లడం పెద్ద కష్టం కాదనేది వారి నమ్మకం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు