మణి దర్శకత్వంలో బ్రదర్స్

మణి దర్శకత్వంలో బ్రదర్స్

అన్నదమ్ములు సూర్య, కార్తి కలిసి త్వరలోనే ఓ సినిమాలో సందడి చేయబోతున్నట్టు సమాచారం. స్వతహాగా ఇద్దరూ కలిసి నటించాలని ఎప్పట్నుంచో కోరుకుంటున్నారు. అయితే ఇటీవల వీరిద్దరినీ దృష్టిలో ఉంచుకుని ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఓ కథను సిద్ధం చేశారట. ఆ కథ వినగానే ఇద్దరు అన్నదమ్ములూ ఈ సినిమాలో నటించడానికి తమ అంగీకారం తెలిపినట్టు సమాచారం.

ప్రస్తుతం వేరు వేరు చిత్రాలతో బిజీగా ఉన్న ఈ ఇద్దరూ వీలు చేసుకుని డేట్స్ కేటాయించగానే సినిమాని ప్రారంభించాలని మణిరత్నం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ సినిమాని తమిళంతో పాటు తెలుగులోనూ రూపొందించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English