రజినీ ఫిక్సయ్యాడు.. మొదలుపెట్టేస్తున్నాడు

రజినీ ఫిక్సయ్యాడు.. మొదలుపెట్టేస్తున్నాడు

పోయినేడాది ‘కబాలి’ సినిమా మీద ఏ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ ఏదో ఊహించుకుని థియేటర్లకు వెళ్లిన వాళ్లకు అక్కడ ఇంకేదో బొమ్మ కనిపించింది. తమిళంలో అయినా ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది కానీ.. తెలుగులో మాత్రం డిజాస్టరే అయింది. ఇందులో నీరసించిపోయిన రజినీని చూసి తీవ్రంగా నిరాశ చెందారు మన ఆడియన్స్. రజినీని ఇష్టపడేదే ఆయన ఎనర్జీ చూసి. కానీ పా.రంజిత్ ఆయన్ని సాదాసీదాగా చూపించి నిరాశ పరిచాడు. ఐతే ‘కబాలి’ మీద ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ రజినీ మాత్రం పా.రంజిత్‌ను నమ్మాడు. మళ్లీ అతడికి అవకాశం ఇచ్చాడు. ‘2.0’ తర్వాత రజినీ చేయబోయే సినిమా రంజిత్‌తోనే.

రంజిత్‌తో వద్దని సన్నిహితులు చెప్పినా రజినీ ఒప్పుకోలేదు. అతడితో సినిమాకు ఏర్పాట్లు చేసుకోమని అల్లుడు ధనుష్‌కు చెప్పేశాడు. ఈ కాంబినేషన్లో సినిమాను నిర్మించబోయేది ధనుషే. మేలోనే ఈ చిత్ర ప్రారంభోత్సవానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దాదాపుగా స్క్రిప్టు పూర్తి కావచ్చింది. ప్రి ప్రొడక్షన్ పనులు మొదలైపోయాయి. రజినీ ప్రస్తుతం ‘2.0’ చివరి షెడ్యూల్ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఈ నెలలోనే ఆ సినిమా టాకీ పార్ట్ పూర్తవుతుంది. రజినీ-రంజిత్ కాంబోలో రాబోయే సినిమా మాఫియా నేపథ్యంలో సాగుతుందట. షూటింగ్ చాలా వరకు ముంబయిలోనే జరుగుతుందట. ఈ చిత్రానికి ఇంకా కథానాయిక ఖరారవ్వలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English