బాలయ్య ఫ్లాపుల గురించి సాయిధరమ్..

బాలయ్య ఫ్లాపుల గురించి సాయిధరమ్..

మెగా ఫ్యామిలీ హీరోలు నందమూరి హీరోల గురించి.. నందమూరి హీరోలు మెగా ఫ్యామిలీ హీరోల గురించి మాట్లాడితే జనాల్లో క్యూరియాసిటీ పెరుగుతుంది. మామూలుగా మాట్లాడితేనే అంత ఆసక్తి ఉంటే.. ఇక పొగడ్తలు గుప్పిస్తే ఎలా ఉంటుంది..? మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ అదే చేస్తున్నాడు. అతను బాలయ్య మీద ప్రశంసలు కురిపించాడు. చిరు తరం సీనియర్ హీరోల ప్రస్తావన వచ్చినపుడు బాలయ్యను తెగ పొగిడేశాడు సాయిధరమ్. ఇంకా నాగార్జున.. వెంకటేష్‌ల మీదా సాయిధరమ్ ప్రశంసలు కురిపించాడు. ఇంతకీ ఈ సీనియర్ల గురించి అతనేమన్నాడంటే..

‘‘బాలకృష్ణ గారు వంద సినిమాలు చేశారు. అది చిన్న విషయం కాదు. నాకు బాలయ్య గారి ఎనర్జీ లెవెల్స్ అంటే ఇష్టం. ఆయన డైలాగ్ డెలివరీ చాలా బాగుంటుంది. డ్యాన్సులు కూడా బాగా చేస్తారు. ఆయన ఏ విషయంలోనూ వెనుకంజ వేయరు. ఒక టైంలో ఆయన వరుసగా ఫ్లాపులు ఎదుర్కొన్నారు. అయినప్పటికి ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ప్రేక్షకులకు తన వంతుగా ది బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. ఇక నాగార్జున గారు చాలా స్టైలిష్‌గా ఉంటారు. ఆయన మాట.. నడక అన్నీ నాకిష్టమే. తనను తాను మెయింటైన్ చేసే తీరు ఆకట్టుకుంటుంది. ఆధ్యాత్మిక చిత్రాల్లో అద్భుతంగా నటించి మెప్పించారు. వెంకటేష్ గారి విషయంలో సింప్లిసిటీ నాకు నచ్చుతుంది. చాలా ఫ్రెండ్లీగా కూడా ఉంటారు. ఆయనతో ఉంటే పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. అందరితోనూ సులభంగా కలిసిపోతారు’’ అని సాయిధరమ్ అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు