బాలయ్యా.. ఈ గోలేందయ్యా

బాలయ్యా.. ఈ గోలేందయ్యా

బాలయ్య వందో సినిమాకు ముందు ఎలాంటి సందిగ్ధత నెలకొందో.. ఇప్పుడూ అదే పరిస్థితి కనిపిస్తోంది. వందో సినిమా డైరెక్టర్ అంటూ చాలామంది పేర్లు వినిపించాయి. చివరికి క్రిష్ ఫిక్సయ్యాడు. 101వ సినిమాగా ‘రైతు’ పక్కా అని నెల కిందటి వరకు ఫిక్సయి ఉన్నారంతా. కానీ ఆ ప్రాజెక్టు పక్కకు వెళ్లిపోయింది. ఇప్పుడు కె.ఎస్.రవికుమార్.. పూరి జగన్నాథ్ రేసులో ఉన్నారు. వీళ్లిద్దరితోనూ సినిమాలు పక్కా అంటే పక్కా అంటున్నారు.

ఒక వార్తలో పూరితో పూరి సినిమా పక్కా.. అధికారిక ప్రకటనే తరువాయి అంటారు. ఇంకో దాంట్లో ఏమో కె.ఎస్.రవికుమార్‌తో సినిమాకు కన్సిడరేషన్లో ఉన్న టైటిల్స్ ఇవీ అని వార్తలిస్తున్నారు. దాని బ్యాక్ డ్రాప్ గురించి కూడా చెబుతున్నారు. మరి ఈ రెండింట్లో బాలయ్య ఏది చేస్తున్నట్లు.. రెండూ చేసేట్లయితే ఏది ముందు చేయబోతున్నట్లు అన్నది స్పష్టత లేదు.

ఈ విషయంలో బాలయ్య అభిమానులు బుర్రలు బద్దలు కొట్టేసుకుంటున్నారు. బాలయ్య మాత్రం ఇంకా ‘శాతకర్ణి’ అవతారంలోనే ఉంటూ అక్కడా ఇక్కడా వేడుకల్లో, ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. మరి బాలయ్య మదిలో ఏం ఆలోచన ఉందో ఏమో. ఇప్పటికే నందమూరి అభిమానులు చాలా సస్పెన్స్ అనుభవించారు. ఇకనైనా బాలయ్య వాళ్లకు కొంచెం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తే బెటర్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు