చిరంజీవి ఈసారి ఆమెతో రొమాన్స్‌ చేస్తాడా?

చిరంజీవి ఈసారి ఆమెతో రొమాన్స్‌ చేస్తాడా?

తనకంటే వయసులో చాలా చిన్నదైన కాజల్‌తో చిరంజీవి రొమాన్స్‌ చేయడం అప్పట్లో విమర్శల పాలయింది. అయితే తెరపై ఈ జంట మరీ ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నారనుకోండి. సినిమా హిట్టవడంతో కాజల్‌తో నటించిన విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కాజల్‌ పక్కన యంగ్‌గా కనిపించడాన్ని ఛాలెంజ్‌గా తీసుకున్న చిరంజీవి మరోసారి తనకి తానే ఇంకో పరీక్ష పెట్టుకోబోతున్నారని ప్రచారమవుతోంది.

చిరంజీవి మలి చిత్రంలో ఆయన సరసన శృతిహాసన్‌ నటిస్తుందని వార్తలొస్తున్నాయి. కాజల్‌లానే చరణ్‌, అల్లు అర్జున్‌లతో నటించిన శృతిహాసన్‌ ఇప్పుడు చిరంజీవితో నటించడం పెద్ద వార్త కాకపోవచ్చు కానీ చిరంజీవి సమకాలీకుడు అయిన కమల్‌హాసన్‌ పుత్రికతో జంట కట్టడానికి మెగాస్టార్‌ ఒప్పుకుంటారా అనేదే ఆసక్తికరంగా అనిపిస్తోంది. పాత్ర నచ్చితే వాళ్లు, వీళ్లు అంటూ చూడకుండా నటించే అలవాటు లేని శృతి ఈ ప్రపోజల్‌కి అభ్యంతరం చెప్పకపోవచ్చు.

కానీ కమల్‌ ఫ్యాక్టర్‌ దృష్టిలో పెట్టుకుని చిరంజీవి వెనుకంజ వేయవచ్చు. సురేందర్‌ దర్శకత్వంలో రూపొందే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రీ ప్రొడక్షన్‌ పనులైతే ముమ్మరంగా జరుగుతున్నాయి కానీ మళ్లీ హీరోయిన్‌ ఎవరైతే బాగుంటుందనే దాని మీదే చర్చ తీవ్రంగా జరుగుతున్నట్టు తెలిసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు