జగన్‌ ఇక మారడా?

జగన్‌ ఇక మారడా?

'మరో చంటిగాడి ప్రేమకథ' అంటూ ఊరిస్తుంటే ఇడియట్‌ మాదిరిగా ఏదైనా అద్భుతాన్ని పూరి జగన్నాథ్‌ ఆవిష్కరిస్తున్నాడేమో అనే ఆశ కలగడం సహజం. అత్యంత వినోదాత్మక చిత్రాలని అందించే దర్శకుడిగా పేరెన్నిక గన్న పూరి జగన్నాథ్‌ ఈమధ్య కాలంలో మూస పోసిన కథలతో, బోర్‌ కొట్టించే హీరో క్యారెక్టరైజేషన్‌తో బాగా విసిగిస్తున్నాడు. టైటిల్‌ మార్చి అన్నిట్లోను మళ్లీ మళ్లీ తిప్పి తిప్పి అదే చూపిస్తున్నాడు.

అతని సినిమా పోస్టర్లు చూసినా, హీరోల బట్టలు చూసినా అన్నీ ఒకేలా తోస్తున్నాయి. లోఫర్‌, ఇజం తర్వాత ఇప్పుడు రోగ్‌ పోస్టర్లే చూస్తే హీరోల గెటప్స్‌ దగ్గర్నుంచీ, వేసుకున్న బట్టల దగ్గర్నుంచి, పెట్టుకున్న టోపీల వరకు అన్నిట్లోను పోలిక చూడవచ్చు. ప్రతి సినిమాలోను హీరోని పోరంబోకులా చూపించి, అతడితో హీరోయిన్‌ వెంట పరుగులు పెట్టించి, నలుగురు విలన్లని కొట్టించి, ఒక పది పంచ్‌ డైలాగులు చెప్పించి ఇంతే సినిమా అని ముగించేయడం జగన్‌కి అలవాటుగా మారిపోయింది.

'రోగ్‌'తో కొత్త జగన్‌ని చూస్తారంటూ సన్నిహితులతో చెబుతున్నాడంటే నిజంగానే ఏదో అద్భుతం చేసి వుంటాడనే ఆశ కలగకపోదు. కానీ ఈ పోస్టర్లలో ఇషాన్‌ లుక్‌ చూస్తే ఇదీ పూరి మార్కు హీరో సొదే అనిపించక మానదు. కనీసం ట్రెయిలర్‌తో అయినా కొత్త ఫీల్‌ తెప్పించగలడేమో చూడాలిక.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు