రజినీ సరసన ఆమె.. సూటవుతుందా?

రజినీ సరసన ఆమె.. సూటవుతుందా?

స్టార్ హీరోలకు హీరోయిన్లను వెతకడం చాలా కష్టమైపోతోంది ఈ మధ్య. ముఖ్యంగా వయసు మళ్లిన హీరోలకు హీరోయిన్లను సెట్ చేయడం పెద్ద తలనొప్పిగా మారింది. ఇంతకుముందులాగా పడుచు అమ్మాయిల్ని పెట్టేసి లాగించేసే పరిస్థితి లేదు. హీరోలు కూడా వయసుకు తగ్గ పాత్రల్ని ఎంచుకుంటూ ఉండటంతో అందుకు తగ్గ హీరోయిన్లనే సెట్ చేయాల్సి వస్తోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ గత సినిమా ‘కబాలి’లో ఆయనకు రాధికా ఆప్టేతో బాగానే జోడీ కుదిరింది. ఇక ‘2.0’లో రజినీ సరసన బ్రిటిష్ బ్యూటీ అమీ జాక్సన్ ఎలా ఉంటుందో అన్న డౌట్లున్నాయి కానీ.. ఆ సినిమా నేపథ్యం.. శంకర్ దర్శకుడు కావడంతో ఏదో మ్యాజిక్ జరిగే ఉండొచ్చు.

2.0 తర్వాత రజినీ ‘కబాలి’ డైరెక్టర్ పా.రంజిత్ దర్శకత్వంలోనే ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. మేలో మొదలుకానున్న ఈ చిత్రానికి కథానాయిక ఓకే అయిపోయింది. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ విద్యాబాలన్ రజినీతో జోడీ కట్టబోతున్నట్లు తెలిసింది. విద్యా సౌత్ అమ్మాయే. బాలీవుడ్లో హీరోయిన్ గా మంచి పేరు సంపాదించింది. రజినీతో ఇంతకుముందే ఓ సినిమాలో నటిస్తుందన్న ప్రచారం జరిగింది కానీ.. అది సాధ్యపడలేదు. రంజిత్ హీరోయిన్ల పాత్రలకు మంచి ప్రాధాన్యం ఉండేలా చూసుకుంటాడు. పైగా రజినీతో జోడీ కట్టే అవకాశం.. అందుకే విద్య ఈ సినిమా ఒప్పుకుందట. ఐతే మామూలుగానే లావుగా ఉండే విద్య.. పెళ్లి తర్వాత మరింత బరువు పెరిగింది. రజినీ చూస్తే సన్నగా ఉంటాడు. ఇంతకుముందు ‘లింగ’ సినిమా కోసం రజినీకి సోనాక్షితో జోడీ కట్టిస్తే.. జంట తేలిపోయింది. మరి రజినీ-విద్య జోడీ ఎలా ఉంటుందో చూడాలి. ఈ చిత్రం ముంబయి బ్యాక్ డ్రాప్ లో నడుస్తుందని సమాచారం. రజినీ అల్లు ధనుషే ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు