పధ్నాలుగేళ్లకే బీఎఫ్‌, లిప్‌లాక్‌

పధ్నాలుగేళ్లకే బీఎఫ్‌, లిప్‌లాక్‌

సెలబ్రిటీలు తమ గురించిన పచ్చి నిజాలు దాచుకోకుండా చెప్పేయడం ప్రస్తుతం నడుస్తోన్న సెన్సేషనల్‌ ట్రెండ్‌. ప్రతి ఒక్కరి జీవితాల్లో కొన్ని డార్క్‌ సీక్రెట్స్‌ వుంటాయి. వాటి గురించి ఎవరితోనైనా చెప్పుకోవడానికి జంకేవారు. కానీ ఈమధ్య ట్రెండు మారింది.

తమ జీవితంలోని చేదు అనుభవాలు, సంచలన అనుభవాల గురించి షేర్‌ చేసుకోవడం 'కూల్‌' అనిపించుకుంటోంది. తన 'వక్షోజాలని' ఒక వ్యక్తి పట్టుకున్నాడని ఇటీవల సోనమ్‌ కపూర్‌ చెప్పడం సంచలనమైంది. అదే విధంగా చాలా మంది హీరోలు, హీరోయిన్లు తమ బెడ్‌రూమ్‌ సంగతులని, తమ సెక్స్‌ ప్రిఫరెన్సులని కూడా ఏకరవు పెడుతున్నారు.

తాజాగా శ్రీలంక సుందరి జాక్వెలీన్‌ ఫెర్నాండెజ్‌ తన తొలి ప్రేమ అనుభూతులు పంచుకుంటూ పధ్నాలుగేళ్లకే తొలి ముద్దు అనుభవం చవిచూసానని, స్కూల్లో ప్రేమలో పడి ఒక కుర్రాడితో మూడేళ్లు ప్రేమాయణం సాగించానని చెప్పింది. అంతే కాకుండా స్కూల్లో వున్న రోజుల్లో తాను చాలా అమాయకంగా వుండేదాన్నని, తన అమాయకత్వాన్ని, బేలతనాన్ని కొందరు అడ్వాంటేజ్‌గా తీసుకున్నారని జాక్వెలిన్‌ తెలియజేసింది.

ఆ ఏజ్‌లో కొందరిని ముద్దు పెట్టుకోవడాన్ని ఇప్పటికీ రిగ్రెట్‌ అవుతుంటానని చెప్పుకొచ్చింది. అంత అమాయకమైన పిల్ల శ్రీలంక అందాల పోటీల్లో గెలవడమే కాకుండా బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌ కావడం విశేషమే సుమీ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు