కొణిదెల నిహారిక హీరో చిన్నోడేం కాదు

కొణిదెల నిహారిక హీరో చిన్నోడేం కాదు

తెలుగులో ఆఫర్లు లేకపోవడంతో తమిళ చిత్ర సీమకి వెళ్లిందని, అక్కడ కూడా నిహారిక కొణిదెలకి చిన్న సినిమాలోనే ఆఫర్‌ వచ్చింది తప్ప స్టార్లు గుర్తించలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. విజయ్‌ సేతుపతి చేసేవి చిన్న బడ్జెట్‌ సినిమాలేమో కానీ అతను చిన్న హీరో అయితే కాదు.

తమిళ హీరోల్లో మంచి సక్సెస్‌ రేట్‌ వున్న హీరోల్లో విజయ్‌ సేతుపతి ఒకడు. అతనిపై ఆడియన్స్‌కి వున్న నమ్మకం వల్ల అతని చిత్రాలన్నీ మంచి ఓపెనింగ్స్‌ తెచ్చుకుంటాయి. విజయ్‌ సేతుపతి చిత్రంలో నటిస్తే తమిళ చిత్ర రంగంలో గుర్తింపు రావడమే కాకుండా ప్రేక్షకులకీ గుర్తుండిపోయే అవకాశముంటుంది. విజయ్‌ సేతుపతితో తమిళ స్టార్‌ హీరోయిన్లు కూడా కలిసి నటించారు. నయనతార అతనితో చేసిన 'నానుమ్‌ రౌడీ ధాన్‌' తమిళంలో చాలా పెద్ద హిట్టు.

ప్రస్తుతం విజయ్‌ సేతుపతితో సమంత ఒక సినిమా చేస్తోంది. స్టార్‌ హీరోలు అందరితో నటించిన సమంత ఈమధ్య కాలంలో తనకి వచ్చిన అవకాశాలన్నీ వదిలేసుకుని మరీ విజయ్‌ సేతుపతి చిత్రాన్ని సైన్‌ చేసింది. కాబట్టి నిహారిక ఏదో చిన్న సినిమాతో శాటిస్‌ఫై అయిపోయిందని ఆమె ఫాన్స్‌ చింతించక్కర్లేదు. నిజానికి తెలుగులో ఆమె చేసిన మొదటి సినిమానే చాలా రకాలుగా చిన్న సినిమా. తమిళంలో ఆమెకి బెటర్‌ లాంఛ్‌ ప్యాడే దొరికిందని చెప్పాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు