బాలయ్య సరసన తమన్నా?

బాలయ్య సరసన తమన్నా?

తన వందో సినిమా విషయంలో అనేక మంది దర్శకుల్ని, అనేక కథల్ని పరిశీలించి.. చివరికి ఎవ్వరూ ఊహించని విధంగా క్రిష్ దర్శకత్వంలో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చేశాడు నందమూరి బాలకృష్ణ. తన 101వ సినిమా విషయంలో కూడా ఆయన ఇలాగే ఆశ్చర్యపరిచేలా ఉన్నాడు. రైతు అని.. ఇంకోటని ఏవేవో ప్రచారాలు జరిగాయి కానీ.. చివరికి ఆయన తమిళ సీనియర్ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తన 101వ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది.

తమిళ మీడియా సైతం దీనికి సంబంధించి వార్తలు ఇస్తుండటం గమనార్హం. కె.ఎస్. కన్ఫమ్ చేయకుండా అక్కడి మీడియా బాలయ్య సినిమా గురించి వార్తలు ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి బాలయ్య-కె.ఎస్. కాంబినేషన్ ఆల్మోస్ట్ కన్ఫమ్ అయినట్లే కనిపిస్తోంది.

ఈ చిత్రంలో బాలయ్య సరసన తమన్నా కథానాయికగా నటిస్తున్నట్లు కూడా తమిళ మీడియాలో వార్తలు వస్తుండటం విశేషం. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ తర్వాత శ్రియతో కలిసి ఇంకో సినిమా చేయాలని భావించాడు బాలయ్య. ‘రైతు’ చేసేట్లయితే ఆమెకే అవకాశం దక్కేదేమో. ఐతే ఆ ప్రాజెక్టును హోల్డ్‌లో పెట్టి కె.ఎస్. దర్శకత్వంలో చేయడానికి రెడీ అయ్యాడు బాలయ్య. ఈ చిత్రానికి కథానాయికగా తమన్నాను కె.ఎస్. ఓకే చేసినట్లు సమాచారం. ఇదొక ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే కథ అని అంటున్నారు.

గత కొన్నేళ్లలో కె.ఎస్.రవికుమార్ ట్రాక్ రికార్డు ఏమంత బాగా లేకున్నా.. ఆయన తెచ్చిన కథ బాలయ్యను ఎగ్జైట్ చేసిందట. అది కె.ఎస్. సొంత కథ కాదు. ఓ రచయిత రాసిన భారీ కథను తెచ్చి బాలయ్యను మెప్పించాడట. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి అధికారిక సమాచారం బయటికి వచ్చే అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు