బ్లాక్‌బస్టర్‌ ఇచ్చినా 'సరసమైన ధరలకే'

బ్లాక్‌బస్టర్‌ ఇచ్చినా 'సరసమైన ధరలకే'

శతమానం భవతి చిత్రంతో శర్వానంద్‌ సినిమా ఏ రేంజ్‌కి వెళ్లగలదనే సంగతి క్లియర్‌గా తెలిసింది. అంతవరకు అతడిని పన్నెండు, పదిహేను కోట్ల హీరోగా చూసిన వారికి ముప్పయ్‌ కోట్ల పైచిలుకు వసూళ్లతో శతమానం షాకిచ్చింది. మామూలుగా ఇంత పెద్ద హిట్‌ ఇస్తే ఏ హీరో అయినా వెంటనే రేటు పెంచేస్తాడు. కానీ శర్వానంద్‌ మాత్రం తన పారితోషికాన్ని పెంచలేదట. 'శతమానం భవతి'కి ఎంతయితే పారితోషికం తీసుకున్నాడో ఇకపై చేసే చిత్రాలకీ తీసుకోవాలని డిసైడయ్యాడట.

ఒక నాలుగైదు చిత్రాలయిన తర్వాత తన పారితోషికం గురించి పునరాలోచిస్తాడట. హిట్‌ వచ్చిన ప్రతిసారీ పారితోషికం పెంచుతూ పోతే తద్వారా తన సినిమాల బడ్జెట్‌ పెరిగి నిర్మాతలు ఇబ్బంది పడాల్సి వస్తుందని, బడ్జెట్‌ని కంట్రోల్‌లో వుంచడానికి తన రెమ్యూనరేషన్‌ని కంట్రోల్‌లో పెడుతున్నాడట. మళ్లీ ఎప్పుడు హిట్‌ వస్తుందనేది తెలియక హిట్టు రాగానే హీరోలు క్యాష్‌ చేసేసుకోవాలని చూస్తారు. కానీ శర్వానంద్‌ మాత్రం అన్నీ మంచి కథలే చేద్దామని, డబ్బులని బట్టి సినిమాలు ఎంచుకోవద్దని అనుకుంటున్నాడట.

ఆ విధంగా అటు తన సినిమాలు బాగుండడంతో పాటు, హిట్టవుతూనే వుంటాయని, తన మార్కెట్‌ కూడా స్టెబులైజ్‌ అయి పాతిక కోట్ల రేంజ్‌లో సెటిల్‌ అవుతుందని భావిస్తున్నాడట. మొత్తానికి కెరియర్‌ పరంగా శర్వానంద్‌కి వున్న క్లారిటీ మాత్రం సూపర్‌ కదూ? మిగిలిన యువ హీరోలు కూడా ఇంత క్లియర్‌ మైండ్‌తో వుంటే అంత త్వరగా అపజయాలు వారి జోలికి పోవు కదా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు